ఏపీ : బాబును నమ్మని సీమ ప్రజలు.. ఆ ఫలితాలే రిపీట్ కానున్నాయా?

Reddy P Rajasekhar
చంద్రబాబు నాయుడు ఏ బహిరంగ సభలో మాట్లాడినా తనకు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని తాను రాజకీయాల్లో సంచలనాలు సృష్టించానని హైదరాబాద్ అభివృద్ధికి తానే కారణమని చెబుతూ ఉంటారు. అయితే చంద్రబాబు మాటలను ఎవరు నమ్మినా నమ్మకపోయినా సీమ ప్రజలు మాత్రం అస్సలు నమ్మట్లేదు. 2019 ఎన్నికల్లో రాయలసీమలో టీడీపీకి వచ్చిన ఫలితాలే ఇందుకు ప్రూఫ్ అని చెప్పవచ్చు.
 
రాయలసీమలోని 52 నియోజకవర్గాల్లో కేవలం మూడు నియోజకవర్గాల్లో మాత్రమే టీడీపీ 2019 ఎన్నికల్లో విజయం సాధించింది. ఐదేళ్ల కాలంలో ఉమ్మడి కడప, ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో టీడీపీ పుంజుకోలేదని ఉమ్మడి అనంతపూర్, ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో మాత్రం టీడీపీ గతంతో పోల్చి చూస్తే మెరుగైన ఫలితాలను సాధించే అవకాశం అయితే ఉందని తెలుస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో రాయలసీమ ప్రజలకు మేలు చేసేలా చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు.
 
చాలా సందర్భాల్లో రాయలసీమను అభివృద్ధి చేసే ఛాన్స్ వచ్చినా ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేదు. వైసీపీ రాయలసీమలో 40కు పైగా స్థానాలలో ఈ ఎన్నికల్లో సైతం విజయం సాధించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. సీమలో వైసీపీకి ఈ స్థాయిలో ఫలితాలు వస్తే ఏపీలో మరోసారి వైసీపీకే అధికారం సొంతమవుతుంది. రాయలసీమలో జనసేన పార్టీకి అయితే నామమాత్రపు ప్రాధాన్యత కూడా లేదు.
 
మెగా ఫ్యామిలీని అభిమానించే అభిమానులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నా ఆ అభిమానం కేవలం సినిమాల వరకు మాత్రమేనని తెలుస్తోంది. సీమలో జనసేన, బీజేపీని అభిమానించే వాళ్లు పరిమితంగా ఉన్నారు. ఆ ఓట్లపై టీడీపీ అభ్యర్థులు ఆశ పెట్టుకుంటే మాత్రం అత్యాశే అవుతుంది. 2024 ఎన్నికల్లో విజయం సాధించకపోతే టీడీపీ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని చెప్పవచ్చు. అపర చాణిక్యుడినని చెప్పుకునే చంద్రబాబు ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తారో చూడాలి. జగన్ చంద్రబాబుకు షాకిచ్చేలా త్వరలో మరికొన్ని పథకాలను ప్రకటించనున్నారని భోగట్టా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: