ఏపీ: జగన్ వస్తే రాష్ట్రం సర్వనాశనం.. ప్రజల్ని కన్ఫ్యూజన్‌లో పడేసిన చంద్రబాబు..?

Suma Kallamadi
టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను కన్ఫ్యూజన్‌లో పాడేశారు. జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని ఆయన షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. సీఎం జగన్ ప్రజల కోసం ఏ ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రి అందించిన సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. పేద ప్రజలు ఏదో ఒక రూపంలో ఆయన ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఇక జగన్ తీసుకొచ్చిన వాలంటీర్ సర్వీస్ ప్రజలకు బాగా ఉపయోగపడుతోంది. దీనిని సొంత రాష్ట్రాల్లో కూడా మొదలు పెట్టాలని ఇతర రాష్ట్రాల సీఎంలు తపన పడుతున్నారు.
 విద్య, వైద్యం, రవాణా, ఇంకా రకరకాల రంగాలలో వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ప్రజలకు ఎంతగానో సహాయ పడుతున్నాయి. ఇలాంటి పథకాలు కొనసాగాలంటే వైసీపీకే ఓటు వేయాలని జగన్ ప్రజలకు ప్రతి ప్రసంగంలో స్పష్టంగా చెబుతున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు మాత్రం జగన్ వస్తే ఈసారి రాష్ట్రం మొత్తం నాశనం అవుతుందని కామెంట్లు చేస్తున్నారు. తాను వాలంటీర్లకు జీతాలు పెంచుతానని హామీలు కూడా ఇస్తున్నారు. ఇలాంటి ప్రసంగాలు ఎక్కువగా ఇస్తూ జగన్ కావాలా వద్దా అనే సందేహంలో ప్రజలు పడిపోయేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
బీజేపీ పార్టీతో పొత్తు కుదుర్చుకొని ఆ ఓట్లను కూడా గెలుపొందాలని చూస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ నారా లోకేష్ బాలకృష్ణ వంటి కీలక నేతలు కూడా జగన్ ఈసారి అధికారంలోకి వస్తే చాలా ప్రమాదకరమని ప్రజల్లో భయం పుట్టిస్తున్నారు. అయితే చాలామంది ఇప్పటికే ఎవరికి ఓటు వేయాలని అనే విషయం నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. అది ఎవరు అనేది ఫలితాలు రోజు మాత్రమే తేలుతుంది. అప్పటిదాకా సస్పెన్స్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు.
రాష్ట్ర శాసనసభలోని మొత్తం 175 మంది స్థానాల్లో 13 మే 2024న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఫలితాలు 4 జూన్ 2024న ప్రకటించనున్నారు. అంటే ఇంకా రెండు నెలల సమయం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: