ఏపీ: కొత్త అజెండాను తేల్చి చెప్పిన జగన్.. టీడీపీ నేతల్లో మరింత గుబులు..?

Suma Kallamadi
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన పదవిని కాపాడుకోవడానికి కృషి చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే తన జిల్లాలో పర్యటనలను పూర్తి చేశారు. ఇటీవలే అనంతపురంలో కూడా పర్యటించి అక్కడ అద్భుతమైన ప్రసంగాలను ఇచ్చారు. సిద్ధం సభలలో జగన్ ఇస్తున్న స్పీచ్ లు బాగా హైలైట్ అవుతున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో జగన్ తన అజెండాను స్పష్టంగా తెలియజేశారు. తనవల్ల ఎవరికైతే మంచి జరిగిందే వారు తనకి ఓటు వేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. జగన్ ఇది ఎప్పుడూ చెప్పేదే. ఆయన కొత్తగా చెప్పిన విషయాలు ఏంటంటే.. వాలంటీర్లు కావాలంటే వైసీపీకి ఓటెయ్యండి లేదంటే వేరే పార్టీకి ఓటేయండి అని జగన్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
వాలంటీర్ వ్యవస్థ పై ఏపీ ప్రజలు బాగా ఆధారపడుతున్నారు. ఒకానొక సమయంలో వాలంటీర్ వ్యవస్థ స్తంభించిపోయినప్పుడు ప్రజలు బాగా ఇబ్బందులు పడ్డారు. అంతేకాదు వాళ్ల అవసరం చాలా ఉందనే అభిప్రాయం ఇప్పుడు ప్రజల్లో ఏర్పడింది. పెన్షన్లు, రేషన్ సరుకులు అన్నీ కూడా నెల కాగానే ఇంటి ముందుకు వచ్చేస్తుండడం వల్ల చాలామందికి టైం, శ్రమ ఆదా అవుతుంది. వేరే పార్టీ వస్తే అలాంటి సర్వీస్ కొనసాగించకపోవచ్చు. ఇక వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. అమ్మ వడి నుంచి పెన్షన్ల వరకు జగన్ అందిస్తున్న పథకాలు అద్భుతంగా ఉన్నాయి. ఆ కారణం చేత చాలామంది వైసీపీ పార్టీనే గెలిపించాలని ఆలోచనలో ఉన్నారు.
వేరే పార్టీ ఈ సంక్షేమ పథకాలను కొనసాగించకపోతే పరిస్థితి ఏంటి అనే భయం కూడా ప్రజల్లో నెలకొన్నది. ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమికి నాయకుడు చంద్రబాబు. ఆయన గతంలో ఎన్నో పథకాలు ఇస్తానని హామీ ఇచ్చారు కానీ ఏదీ కూడా నెరవేర్చలేదు. అందువల్ల అతన్ని నమ్మే అవకాశాలు తక్కువ అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా జగన్ ప్రజలకు ఒక హెచ్చరిక లాంటిది చేస్తూ తన పార్టీ భారీ మెజారిటీతో గెలిచేలా ప్రసంగాలు ఇస్తున్నారు. ఈ ప్రసంగాలను విని టీడీపీ నేతలు బాగా భయపడిపోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: