మెదక్ : టికెట్టైతే వచ్చింది.. మరి గెలుపు?

frame మెదక్ : టికెట్టైతే వచ్చింది.. మరి గెలుపు?

praveen
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం మెదక్ లోక్ సభ సెగ్మెంట్ పరిధిలో రాజకీయం ఎంతో ఆసక్తికరంగా మారిపోయింది. మూడు పార్టీల నుంచి కూడా బలమైన అభ్యర్థులు బరిలోకి దిగారు. అయితే బిఆర్ఎస్ నుంచి పెద్దగా రాజకీయ అనుభవం లేని వెంకట్రామిరెడ్డికి పార్టీ అవకాశం ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో దుబ్బాకలో ఓడిపోయిన బిజెపి నేత రఘునందన్ రావుకి మెదక్ ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చింది. అయితే ఇక మెదక్ పార్లమెంటు పరిధిలో బీసీ సెంటిమెంట్ కలిసి వస్తుంది అని భావించిన కాంగ్రెస్ నీలం మధు కి అవకాశం కల్పించింది


 అయితే ఇలా నేను మీ బీసీ బిడ్డను నన్ను ఆశీర్వదించండి అంటూ ఎన్నికల ప్రచార బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న నీలం మధు ఓటర్లను ఎంతవరకు ఆకట్టుకుంటాడు అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే నీలం మధు మొన్నటి వరకు చిట్కులు గ్రామ సర్పంచ్ గా కొనసాగారు. అంతకుముందు పలు ఎన్నికలలో పోటీ చేసినా గెలుపొందలేదు. అయితే గత అసెంబ్లీ ఎన్నికలలో గూడెం మహిపాల్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా బరిలోకి దిగారు. పటాన్చెరు పార్లమెంటు నియోజకవర్గం లో భారీగానే ఓట్లు సంపాదించుకున్నారు.


 బీఎస్పీ లాంటి పెద్దగా ఆదరణ లేని పార్టీ తరఫున బరిలోకి దిగినప్పటికీ ఇక నీలం మధు ఓటర్లను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పుడు మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో కూడా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం వల్ల మంచి నీలం మధుకి మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఫాలోయింగ్ ఒక్కటే ఉంటే సరిపోదు.. ప్రచారంలో దూసుకుపోతూ ఓటర్లందరినీ కూడా ఆకట్టుకోవాలి.. ప్రత్యర్థులను మించి ఓటర్లను ఆకట్టుకున్నప్పుడే గెలిచే అవకాశం ఉంది అయితే. నీలం మధుకి అటు బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు నుండి గట్టి పోటీ ఎదురయ్యే చాన్స్ ఉంది. ఎందుకంటే రఘునంద మంచి వ్యాఖ్యాత.. స్పీచ్ మొదలు పెట్టాడంటే ఓటర్లు అందరిని తన ప్రసంగాలతో ఇట్టే  తన వైపుకు తిప్పుకోగలరు. ఇక రాజకీయ అనుభవం కూడా చాలానే ఉంది. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి కూడా గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు. ఇక ఇలాంటి ఇద్దరు ప్రత్యర్థులను ఎదుర్కొని నీలం మధు ఎంత వరకు ఓటర్లను ఆకట్టుకుంటాడు అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఎంతో కష్టపడి ఎంపీ టికెట్ సాధించుకున్న తమ అభిమాన నాయకుడు నీలం మధును తప్పకుండా గెలిపించుకుంటామని అభిమానులు పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: