తెలంగాణ: టికెట్ల విషయంలో లెక్క తప్పిన కాంగ్రెస్...!

తెలంగాణ పార్లమెంట్ టికెట్ల సామాజిక సమీకరణాల విషయంలో కాంగ్రెస్ లెక్క తప్పిందా ..? కొన్ని కులాలకు మాత్రమే టికెట్లు ఇచ్చిందా ..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి . గౌడ , యాదవ, మాదిగ సామాజిక వర్గాలకు ఆ పార్టీ అసలు టికెట్లే కేటాయించలేదు . నాగర్ కర్నూల్ లోక్సభ టికెట్ కోసం మల్లు రవి మాల, సంపత్ కుమార్ మాదిగ పోటీ పడగా చివరికి మల్లు రవికి టికెట్ దక్కింది . పెద్దపల్లి లో సైతం మాల సామాజిక వర్గానికి చెందిన గడ్డం వివేక్ తనయుడు గడ్డం వంశీ కృష్ణ కు టికెట్లు కేటాయించింది . దీంతో అక్కడ మాదిగ సామాజిక వర్గ నేతలు మండిపడుతున్నారు.

మరోవైపు వరంగల్ ఎంపీ టికెట్ ను మాదిగ సామాజిక వర్గానికి కేటాయిస్తారని భావించారు . కానీ ఆ టికెట్ బీ ఆర్ఎస్ నుండి వచ్చిన కడియం కావ్య బైండ్ల కు కేటాయించారు . కాంగ్రెస్ తీరుతో మాదిగ సామాజిక వర్గం గురుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు కేటాయించిన 14 ఎంపీ సీట్లలో గౌడ, యాదవ సామాజిక వర్గాలకు ఒక్క టికెట్ కూడా కేటాయించకపోవడం ఆశ్చర్యకరం. తెలంగాణలో కాంగ్రెస్ మరో మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

వాటిలో హైదరాబాద్ స్థానంలో గౌడ లేదా యాదవ సామాజిక వర్గానికి సంబంధిం చిన అభ్యర్థిని బరిలో దింపే అవకాశం ఉన్నట్టు సమాచారం . మరో వైపు కరీంనగర్ లోక్సభ స్థానానికి కాపు లేదా రెడ్డి అభ్యర్థికి టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు సమాచారం . ఇక ఖమ్మం టికెట్ విషయంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ కు ఎలాంటి క్లారిటీ లేదని ప్రచారం జరుగుతోంది . మరి ఈ టికెట్ ను ఏ సామాజిక వర్గానికి కేటాయిస్తారన్నది ఆసక్తికరం గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: