పాలు, తేనెతో డార్క్ సర్కిల్స్ మాయం...ఏం చేయాలంటే...?

lakhmi saranya
ఆడవాళ్లు ఎక్కువగా అందానికి ప్రాధాన్యత ఇస్తారు. తాము అందంగా కనిపించాలని అనుకుంటారు. ఇంట్లోనే రకరకాల టిప్స్ ని పాటిస్తూ ఉంటారు. రోజుల్లో ప్రతి ఒక్కరూ డిజిటల్ వస్తువులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అవి కళ్ళ సమస్యలకు కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. కంప్యూటర్లు, ఫోన్లు, టెలివిజన్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు నుంచి వెలువాడే కాంతి కళ్ళకు హాని కలిగిస్తుంది. వీటి కారణంగా కంటి చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడతాయి. అధిక ఒత్తిడి, నిద్రలేమి, శరీర శ్రమ ఇలా చాలా కారణాలతో ఈ నల్లటి మచ్చలు వస్తాయి. కంటి చుట్టూ ఉన్న టార్క్ మెరూన్ ఆర్బిక్యులారిస్ ఓక్యులి కండరం ప్రతిబింబించడం వల్ల ఈ డార్క్ సర్కిల్స్ వస్తాయి.
అయితే, చాలామంది వీటిని తగ్గించుకోవటం కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, పాలను ఉపయోగించి ఈ డార్క్ సర్కిల్స్ ను పూర్తిగా తొలగించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. చాలామందికి డార్క్ సర్కిల్స్ కారణంగా ముఖంలో అందం తగ్గుతుంది. ఆడవాళ్లు అయితే వీటిని తగ్గించుకోవటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, కేవలం పాలతోనే డార్క్ సర్కిల్స్ ను తగ్గించుకోవచ్చు. ఇందులో ఉండే ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ చర్మానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. పాలలో లాక్టిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని సున్నితంగా మార్చుతుంది. అంతేకాకుండా డెడ్ సర్కిల్స్ ను తగ్గించటంలో సహాయపడుతుంది.
 దీనివల్ల చర్మం తాజాగా, అందంగా కనిపిస్తుంది. ముందుగా పాలలో కొంచెం తేనెను కలిపి నల్ల మచ్చలపై రాయటం వల్ల ప్రయోజనం ఉంటుంది. పాలు చర్మంపై మంటను తగ్గించి, స్కిన్ టోన్ ను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. పాలు, బాదం నూనె కలిపి ఉపయోగించిన చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. పసుపులో ఉండే యాంటి ఇన్ఫ్లమేటరి చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది. పాలను, పసుపుతో కలిపి రాస్తే కళ్ళ కింద ఉండే నల్లటి వలయాలు తగ్గిపోతాయి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది. చర్మం పై ఉన్న నల్లటి మచ్చలను తగ్గించటంలో రోజ్ వాటర్ సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: