నాగచైతన్య పెళ్లి చేసుకోబోతున్న వేళ రోజుకొక కొత్త షాక్ తగులుతుంది..కొన్నేమో సినిమాలపరంగా అయితే మరికొన్ని షాక్ లేమా వ్యక్తిగత జీవితం పరంగా తగులుతున్నాయి. అయితే తాజాగా నాగచైతన్య మాజీ భార్య సమంత నాగచైతన్య పై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నా మాజీ భర్తకి అనవసరంగా ఖర్చులు పెట్టాను అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి. మరి ఇంతకీ ఆ మాటలు ఎందుకు మాట్లాడింది.. నాగ చైతన్యని ఉద్దేశించే ఆ మాటలు మాట్లాడిందా.. అనేది ఇప్పుడు చూద్దాం.. సమంత రీసెంట్గా నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ విడుదలైన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ వెబ్ సిరీస్ లో సమంత బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ తో రొమాన్స్ చేసింది.
అయితే సిటాడెల్ ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ ధావన్ సమంత ఇద్దరు ఒక చిట్ చాట్ లో పాల్గొన్నారు.ఈ చిట్ చాట్ లో భాగంగా వరుణ్ ధావన్ సమంతని ఎన్నో ప్రశ్నలు అడిగారు.ఇక ఈ ప్రశ్నల్లో భాగంగా మీరు ఇప్పటివరకు ఖర్చు పెట్టిన వాటిల్లో అత్యంత వృధా ఖర్చు దేనికి పెట్టారు అనిపిస్తుంది అని వరుణ్ అడగగా..నేను నా ఎక్స్ కి (అంటే నా మాజీ భర్తకి) పెట్టిన ఖర్చులు వృధా అనిపించింది అంటూ సమంత అన్సర్ ఇచ్చింది.
ఇక దీనికి వరుణ్ ధావన్ ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టారు అని అడిగితే..చాలా ఖర్చు పెట్టాను.గిఫ్టుల కోసం ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాను అంటూ సమంత ఆన్సర్ ఇచ్చేసరికి సమంత మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. దీంతో చాలామంది నెటిజెన్స్ సమంత తన మాజీ భర్తకు అంత ఖరీదైన గిఫ్ట్ లు ఇచ్చిందా.. ఇప్పుడు తనని మోసం చేశాడు కాబట్టి తన మాజీ భర్తకు ఇచ్చిన గిఫ్ట్ లను వృధా ఖర్చుగా జమ కడుతుందా అంటూ కామెంట్లు పెడుతున్నారు