ఏపీ: డజన్ మంది గన్‌మెన్లతో ఊర మాస్ లెవెల్‌లో ప్రచారం చేస్తున్న లోకేష్..?

praveen
2024 అసెంబ్లీ ఎన్నిక వేళ ఏపీలో రాజకీయ ప్రచారాలు ఊపందుకున్నాయి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ ప్రసంగాలు ఇస్తున్నారు. ఆయన సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర చేపడుతున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఏపీ అంతటా తిరుగుతూ ప్రజలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీరందరికంటే లోకేష్‌ పర్యటన బాగా హైలైట్ అవుతోంది. దీనికి కారణం ఆయనకు ఒకపక్క అరడజను గన్‌మెన్లు, మరోపక్క మరో అరడజను స్టన్‌ గన్‌మెన్లు ఉండటమే అని చెప్పుకోవచ్చు. ఇంత బందోబస్తుతో లోకేష్ పర్యటనలు చేస్తుండగా.. అతన్ని చూస్తుంటే  ఇప్పుడు చాలా గొప్పగా అనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఒక యాక్షన్ సినిమాలో హీరో లెవెల్ లో అతడి ఎంట్రీ ఉందని చాలామంది మాట్లాడుకుంటున్నారు.
ప్రస్తుతం లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఇలాంటి బందోబస్తు ఏదీ లేదు. ఎన్నికల సంఘం, బీజేపీ పర్మిషన్ తోటి లోకేష్ తన పక్కన గన్‌మెన్లను ఉంచుకోగలిగారు. వీరితో ఊర మాస్ లెవెల్ లో లోకేష్ మంగళగిరి జిల్లా అంతటా తిరుగుతున్నారు. ఆయన టూర్స్ ఆయన అడిగేస్తే మాస్ అనే రేంజ్ లో ఉంటున్నాయి. మరోవైపు లోకేష్ మామయ్య బాలయ్య హిందూపురం ప్రాంతంలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
నిజానికి వీరు కూడా రాష్ట్రమంతటా తిరగాల్సి ఉంది కానీ అంత అవసరం లేదని చంద్రబాబు నాయుడు ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ ఒక్కరే ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నారు. చంద్రబాబు కూడా సింగిల్ గా ప్రచారం చేయడానికి పూనుకున్నారు. ఒక పార్టీ నుంచి ఒక నాయకుడు రాష్ట్రమంతటా తిరిగితే సరిపోతుందనే నమ్మకంతో వీరు ఉన్నారు. మరి ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. సర్వేలు మాత్రం జగన్ గెలిచే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నాయి. ప్రజల అభిప్రాయాల సేకరణలో కూడా జగన్ ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: