కర్నూలు : అప్పుడు 14 అప్పుడు 12.. ఆ రెండు స్థానాలలో మాత్రం భారీ షాకులు తప్పవా?

Reddy P Rajasekhar
సాధారణంగా ఎంత చరిత్ర ఉన్న పార్టీకి అయినా జిల్లాలో ఉన్న అన్ని స్థానాలలో విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయడం సులువైన విషయం కాదు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ మాత్రం మెజారిటీ జిల్లాలలో సునాయాసంగా క్లీన్ స్వీప్ చేసి ఏకంగా 151 స్థానాలను సొంతం చేసుకుంది. వైసీపీ ఎంత గొప్పగా పాలన సాగించినా వేర్వేరు కారణాల వల్ల పట్టణ ఓటర్లలో వైసీపీపై కొంత వ్యతిరేకత ఉంది.
 
మరోవైపు 2019 ఎన్నికల్లో 14 స్థానాల్లో విజయం సాధించిన వైసీపీ ఇప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎన్ని ప్రయత్నాలు చేసినా అదే స్థాయిలో స్థానాలను సాధించడం కష్టమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ ఎన్నికల్లో 12 స్థానాల్లో మాత్రమే ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీ సత్తా చాటా చేసే ఛాన్స్ ఉందని సర్వేల లెక్కలు చెబుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో బీజేపీ, జనసేన ప్రభావం పెద్దగా లేదు.
 
అయితే గతంతో పోల్చి చూస్తే జిల్లాలో టీడీపీ పుంజుకోవడం గమనార్హం. కర్నూలు, మంత్రాలయం, డోన్, బనగానపల్లె, శ్రీశైలం నియోజకవర్గాల్లో వైసీపీ టీడీపీ మధ్య హోరాహోరీ పోటీ ఉండనుంది. వైసీపీ నేతలు ఎంతో కష్టపడితే మాత్రమే ఎన్నికల ఫలితాలను ఈ నియోజకవర్గాల్లో మార్చగలరు. విచిత్రం ఏంటంటే కొంతమంది టీడీపీ అభ్యర్థులు తాము ఎలాగో గెలవబోమని మొక్కుబడిగా ప్రచారం సాగిస్తున్నారు.
 
కర్నూలులో అభ్యర్థుల ఎంపిక విషయంలో టీడీపీ మరింత జాగ్రత్తలు తీసుకుని ఉంటే సగానికి సగం స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు ఉండేవి. దశాబ్దాల తరబడి పార్టీ కోసం పని చేసిన తిక్కారెడ్డి, ఆకెపోగు ప్రభాకర్, మరి కొందరు నేతలకు టికెట్లు ఇచ్చి ఉంటే టీడీపీ మరింత పుంజుకునేదని విశ్లేషకుల భావన. ఉమ్మడి కర్నూలులో టీడీపీ ప్రధాన నేతల మధ్య సఖ్యత లేకపోవడం ఆ పార్టీకి మైనస్ అవుతోంది.  కర్నూలు జిల్లాలో ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయో లేదో చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: