ఏపీ: ఒకప్పుడు ఆంధ్ర పాలిటిక్స్ లో రెబల్స్.. కనుమరుగవుతున్న వారసులు..!
వంగ వీటి రంగ:
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ కూడా కాపు ఓట్ల చుట్టూనే తిరుగుతూ ఉంటాయి.. అలా రాజకీయాలలో చెరగని ముద్ర వేసుకున్న వంగవీటి మోహన రంగ కాపులకు ఆరాధ్య నాయకుడు.. అయితే ఈయన అన్న వంగవీటి రాధాకృష్ణ రావు హత్యానంతరం రంగా ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు. అప్పటి కమ్యూనిస్టు నేత చలసాని వెంకటరత్నం.. వంగవీటి రాధ మధ్య ఆదిపత్య పోరు కారణంగా 1970లో చలసాని వెంకటరత్నం హత్యకు గురయ్యారు.. ఆ తర్వాత వంగవీటి రాధా కృష్ణారావు హత్య జరిగింది. దీంతో వంగవీటి రంగ వర్గానికి దేవినేని సోదరుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. అప్పటినుంచి బెజవాడలో కాపు వర్సెస్ కమ్మ కులాల మధ్య పోరు జరుగుతూనే ఉంది.. 1981లో మున్సిపల్ కార్పొరేట్ గా.. ఇండిపెండెంట్గా రంగా విజయాన్ని అందుకున్నారు.. ఆ తర్వాత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో విజయవాడ తూర్పు నుంచి రంగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కొన్నేళ్ళకు.. పేదలకు ఇళ్ల పట్టాల కోసం విజయవాడలో రోడ్డు పై నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో రంగాను 1988 డిసెంబర్ 26న మారణాయుధాలతో దాడి చేసి చంపారు. 1989లో రంగా భార్య రత్నకుమారి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచింది. 1994లో కూడా గెలిచి మరొకసారి ఎమ్మెల్యే అయ్యారు.. రంగా వారసుడు వంగవీటి రాధాకృష్ణ పొలిటికల్ పరంగా ఎంట్రీ ఇవ్వగా 2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. 2008లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో రాధ చేరారు. అయితే అప్పుడు ఓడిపోయారు. 2012లో జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైసీపీ పార్టీలో చేరారు.. 2019 ఎన్నికలకు ముందు వైసీపీని వదిలి టిడిపిలో చేరారు. ప్రస్తుతం ఎన్నికలలో రాధ రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
2). పీ. జనార్దన్ రెడ్డి:
హైదరాబాద్ కార్మిక సంఘాల నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా మంత్రి స్థాయిలో ఎదిగారు.. 1983 లో ఓడిపోయిన ఈయన.. 1985, 1989, 1994 వరుసగా పిలిచారు. అలా కాంగ్రెస్లో పలు రకాల శాఖలు మంత్రిగా కూడా పనిచేశారు. చంద్రబాబు ఎన్టీఆర్ నాయకులుగా వున్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నారట... అలాంటి జనార్దన్ రెడ్డి 2007లో గుండెపోటుతో మరణించారు. ఈయన మరణం తర్వాత ఈయన కుమారుడు డివి విష్ణువర్ధన్ రెడ్డి రాజకీయాలలోకి వచ్చారు. 2009లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో మళ్లీ ఓడిపోయారు. 2018 లో కూడా ఓడిపోయారు.. 2023 ఎన్నికలలో కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో బిఆర్ఎస్ లో చేరారు.. రాష్ట్ర విభజనకు ముందే 2014లో ఖైరతాబాద్ నియోజవర్గం నుంచి పోటీ చేయగా అక్కడ ఓడి పోయారు.. ఆ తర్వాత వైసీపీని వీడి టిఆర్ఎస్ లో చేరారు.
3). కోడెల శివప్రసాద్:
టిడిపి పార్టీ లో సీనియర్ నేతలలో కోడెల శివప్రసాద్ కూడా ఒకరు. 1983లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. ఈయన వృత్తి రీత్యా డాక్టర్. 1984,1985,1989,1994,1999 ఇలా వరుసగా ఐదుసార్లు టిడిపి నుంచి విజయాన్ని అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో హోం శాఖ పంచాయతీరాజ్ నీటిపారుదల వైద్యశాఖలో మంత్రిగా కూడా పనిచేశారు.. 1999, 2004,2009 లో ఓడిపోయారు. 2014లో అనంతరం ఎమ్మెల్యేగా గెలిచారు. స్పీకర్ గా కూడా పనిచేశారు. 2019లో పలు ఆరోపణల వల్ల సెప్టెంబర్ 16న ఆత్మహత్య చేసుకున్నారు.. ఆయన కుమారుడు కోడెల శివరాం రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నించినా ఎదగలేకపోయారు.
4). రోశయ్య:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా రోశయ్య పనిచేశారు.. 1968లో మొదటిసారి ఏపీ శాసనమండలి సభ్యుడుగా ఎంపికయ్యారు.. ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రిగా రోశయ్య 16 సార్లు అసెంబ్లీ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. 1985లో ఒకసారి 1989లో ఎమ్మెల్యేగా గెలిచారు.. 1994లో ఓడిపోయారు.. 2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి రెండోసారి విజయాన్ని అందుకున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణంతో ముఖ్యమంత్రి బాధ్యతలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఏడాదికి పైగా పనిచేశారు. 2021 డిసెంబర్ 4న మరణించారు.
5).MV మైసూరా రెడ్డి:
కడప జిల్లాలలో రాజశేఖర్ రెడ్డి తర్వాత ఎక్కువగా వినిపించే పేరు ఈయనదే.. 1985లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కానీ అప్పుడు ఓడిపోయారు.. మళ్లీ 1989లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు.. 2006 టిడిపి నుంచి రాజ్యసభకు వెళ్లారు.. 2012 వరకు రాజ్యసభ ఎంపీగా కొనసాగారు. 2012లో సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయినందువల్ల టిడిపి మైసూరా రెడ్డిని సస్పెన్స్ చేసింది. అయితే వైసీపీకి కేంద్ర కమిటీ సభ్యుడుగా ఉన్న ఈయన 2016లో ఆ పదవిని కూడా తొలగించారు.
ఎలిమినేటి మాధవరెడ్డి:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఈయన టిడిపి పార్టీకి కీలక నేతగా ఎదిగారు.. అలా 1985లో భువనగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.. ఆ తర్వాత వరుసగా నాలుగు సార్లు శాసనసభ్యులుగా. 1995లో రాష్ట్ర హోం మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. 2000 సంవత్సరంలో మార్చి 7న రాత్రి 11 గంటల సమయంలో నక్సలైట్ బాంబు బ్లాస్టింగ్ లో మాధవరెడ్డి చనిపోయారు. ఇక ఈయన భార్య ఉమా మాధవరెడ్డి భువనగిరి ఎమ్మెల్యేగా గెలిచింది. 2014లో టిడిపి అభ్యర్థిగా ఉన్న ఉమా మాధవరెడ్డి ఓడిపోవడంతో అనంతరం టిఆర్ఎస్ పార్టీలోకి చేరారు.
నాగం జనార్దన్ రెడ్డి:
టిడిపి పార్టీతో రాజకీయాల్లోకి వచ్చిన నేతలలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన నాగం జనార్దన్ రెడ్డి కూడా ఒకరు.. 1985లో మొదటిసారి టిడిపి అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచారు.. 1989 ఎన్నికలలో టిడిపి టికెట్ వేరొకరికి ఇవ్వడంతో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయారు.. ఆ తర్వాత 1994, 1999, 2004, 2009లో నాలుగు సార్లు విజయాన్ని అందుకున్నారు. 2014 మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు 2018లో నాగర్ కర్నూల్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2023లో టికెట్ రాకపోవడంతో బిఆర్ఎస్ లోకి చేరారు.
ఎస్పీవై రెడ్డి:
ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రస్తుతం నంద్యాల జిల్లాకు చెందిన మొదటితరం వ్యాపారవేత్త ఎస్పీవై రెడ్డి.. 1979లో నంది పైపుల సంస్థల ప్రారంభించి భారీ క్రేజ్ అందుకున్నారు. ఎక్కువగా రైతుల గురించి ఆలోచించి ప్లాస్టిక్ పైపులు తయారు చేసే కంపెనీని ప్రారంభించారు ఎస్పివై రెడ్డి.. 1991లో లోక్సభ ఎన్నికలలో నంద్యాల నుంచి పోటీచేయగా ఓడిపోయారు.. 1999లో కూడా పోటీ చేసి ఓడిపోయారు.. 2000 సంవత్సరంలో నంద్యాల మున్సిపల్ చైర్మన్ గా ఎంపికయ్యారు. 2004 నంద్యాల లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.. ఆ తర్వాత 2009 అలా మూడుసార్లు గెలిచారు. 2014లో జగన్ నేతృత్వంలో వైసిపి నుంచి ఎంపీగా గెలిచారు. అయితే ఆ తర్వాత కొద్ది రోజులకే టిడిపి పార్టీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలోకి చేరారు. 2019లో టికెట్ ఆశించిన రాలేకపోయింది. ఆ తర్వాత జనసేన పార్టీలో చేరినప్పటికీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన డిపాజిట్లు కూడా రాలేదు.. దీంతో 2019 ఏప్రిల్ 30న మరణించారు.
మరింత సమాచారం తెలుసుకోండి:
-
Kodela Siva Prasada Rao
-
Kurnool
-
nagarkurnool
-
vangaveeti radha krishna
-
Vemuri Radhakrishna
-
Mahbubnagar
-
Corporate
-
Varasudu
-
IYR KrishnaRao
-
Vangaveeti
-
Nandyala
-
september
-
dr rajasekhar
-
central government
-
Vijayawada
-
Rajya Sabha
-
Kamma
-
Janasena
-
Wife
-
December
-
Telangana Chief Minister
-
CM
-
Assembly
-
MP
-
MLA
-
politics
-
Reddy
-
Minister
-
Hanu Raghavapudi
-
devineni avinash
-
Jagan
-
Congress
-
Andhra Pradesh
-
TDP
-
Party
-
CBN
-
YCP
-
Chiranjeevi
-
March