ఏపి: వార్ బోత్ సైడ్ తప్పదా? ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ఇద్ద‌రు మహిళల మధ్య పోటీ తప్పదా?

Suma Kallamadi
ఏపీ రాజకీయం రోజురోజుకీ కొత్త మలుపులు తిరుగుతోంది. ఇక్కడ మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా వైసీపీ నుంచి మ‌హిళ‌లు కొంతమంది ప‌లు స్థానాల్లో పోటీ చేయడం గమనార్హం. అదేవిధంగా టీడీపీ కూటమి నుంచి కూడా కొంతమంది మ‌హిళ‌లు కొన్ని కొన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నారు. అయితే ఇపుడు చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే ఒకే నియోజ‌క‌వ‌ర్గంలో అటు వైసీపీ నుంచి, ఇటు కూట‌మి నుంచి ఇద్ద‌రూ మ‌హిళ‌లే పోటీ చేయడం. అవును, అదే గుంటూరు వెస్ట్‌ నియోజ‌క‌వ‌ర్గం. దాంతో ఇపుడు అక్కడ వార్ బోత్ సైడ్ తప్పదంటూ రాజకీయ విశ్లేషకులు మాట్లాకుంటున్నారు. ఎందుకంటే అక్కడ ఇద్దరికీ సరిసమాన రాజకీయ ఛరిష్మా వుంది అనడంలో అతిశయోక్తి లేదు.
వై‌ఎస్‌ఆర్‌సి‌పి నుంచి మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీ బరిలో ఉండగా టీపీపీ కూట‌మి నుంచి పిడుగురాళ్ల మాధ‌వి పోటీ చేస్తున్నారు. దీంతో ఈ నియోక‌వ‌ర్గం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంకో విషయం ఏమిటంటే ఇక్కడ ఇద్ద‌రూ కూడా బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు. అయితే భ‌ర్త‌లు వేర్వేరు సామాజిక వ‌ర్గాల‌కు చెందిన వారు కావడం కొసమెరుపు. దాంతో వివిధ సామాజికవ‌ర్గాల వారు వీరికి దండిగా మద్దతు ఇస్తారని సౌండ్ బాగా వినబడుతోంది. గుంటూరు వెస్ట్ జ‌న‌ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం. అందుకే వ్యూహాత్మకంగా ఈ టికెట్‌ను వైసీపీ బీసీ నాయ‌కురాలు, మంత్రి ర‌జ‌నీకి కేటాయించింది. అదే ఉద్దేశంతోనే టీడీపీ కూడా స్థానిక నేత అయిన మాధ‌వికి సీట్ ప్రకటించింది.
దాంతో వీరిద్ద‌రూ ఇప్ప‌డు అక్కడ హోరా హోరీ ప్ర‌చారంలో మునిగితేలిపోయారు. ర‌జ‌నీ చిల‌క‌లూరిపేట నుంచి ఎమ్మెల్యేగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇపుడు అక్క‌డ ఆమె ఓడిపోతార‌నే ఉద్దేశంతో వైసీపీ ఆమెను గుంటూరు వెస్ట్‌కు కేటాయించింది. ఇక‌, మాధ‌వి తొలి సారి రాజ‌కీయ‌ల్లోకి వ‌చ్చిన వైద్య వ్యాపారంలో ఉన్న వ్య‌క్తి. ఇక ఇద్ద‌రూ ఉన్న‌త విద్యావంతులు, ఆర్థికంగా బ‌లంగా ఉన్న వారే కావ‌డం జనాల్లో ఆసక్తి నెలకొంది. ఇక ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో పురుష అభ్య‌ర్థుల‌పై మ‌హిళ‌లు, మ‌హిళా అభ్య‌ర్థుల‌పై పురుషులు పోటీ చేస్తున్న నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్న సంగతి తెలిసిందే. ప‌త్తికొండ‌(కంగాటి శ్రీదేవి-కేఈ శ్యాంబాబు), పాత‌ప‌ట్నం(రెడ్డి శాంతి-గోవిందు), న‌గ‌రి(రోజా-గాలి భాను ప్ర‌కాష్‌), మంగ‌ళ‌గిరి(లావ‌ణ్య‌-నారా లోకేష్‌), పిఠాపురం(వంగా గీత‌-ప‌వ‌న్ క‌ల్యాణ్‌) వంటివి ఈ కోవ‌లోకే వ‌స్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

CM

సంబంధిత వార్తలు: