ఆంధ్రప్రదేశ్: అక్కడ గెలిచే బాధ్యతలన్నీ అతడి పైనే పెట్టిన పవన్ కళ్యాణ్..??

Suma Kallamadi
త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేయనున్నట్టు ప్రముఖ రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రకటించారు. దీనివల్ల స్థానిక టీడీపీ (తెలుగుదేశం పార్టీ) ఇన్‌చార్జ్ ఎస్‌విఎస్‌ఎన్ వర్మ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. తాను పోటీ చేయాలనుకున్న స్థానం నుంచి అతను పోటీ చేయడమేంటి అని భగ్గుమన్నారు. తనకు స్థానికంగా ఉన్న పలుకుబడితో కచ్చితంగా గెలిచే వాడినని, ఇప్పుడు పవన్ కి ఇచ్చి పెద్ద తప్పు చేశారని టీడీపీ తనకు అన్యాయం చేస్తుందన్నట్లు శర్మ అగ్గి మీద గుగ్గిలమయ్యారు. అయితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగి పవన్ అభ్యర్థిత్వానికి మద్దతిచ్చేలా వర్మను ఒప్పించారు.
ఇప్పుడు పరిస్థితి సద్దుమణిగింది. జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో విజయం సాధించడంపై వ్యూహాత్మకంగా దృష్టి సారించారు. తన ప్రణాళికలో భాగంగా, తన ఎన్నికల ప్రచారంపై చర్చించడానికి వర్మతో సహా పిఠాపురంలో టీడీపీ, జేఎస్పీ (జన సేన పార్టీ) రెండు నాయకులతో సమావేశమయ్యారు. ఈ చర్చల్లో వర్మ దృఢ నిశ్చయం, నమ్మకమైన నాయకుడని పవన్ కొనియాడారు. వర్మ రిజిడ్‌గా పేరు తెచ్చుకున్నప్పటికీ, పవన్ అతని సత్తాపై విశ్వాసం వ్యక్తం చేశారు. పిఠాపురం గెలుపు బాధ్యతను పూర్తిగా వర్మకు అప్పగించారు, వర్మ కఠోర శ్రమ, నిబద్ధత వల్లే ప్రచారాన్ని నడిపేందుకు సరైన వ్యక్తిగా నిలిచారని ఉద్ఘాటించారు.
దానికి తగ్గట్టుగానే వర్మ తన కమిట్‌మెంట్‌ను నిరూపించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం పవన్ పోరాట యాత్రకు నిస్వార్ధంగా నాయకత్వం వహిస్తానని ఆయన హామీ ఇచ్చారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఎన్నికల వ్యూహం పిఠాపురంలో వర్మ నాయకత్వంపై ఆధారపడి ఉంటుంది. ఎన్నికలలో విజయవంతమైన ఫలితాన్ని సాధించాలని ఇరువురు నేతలు కృతనిశ్చయంతో ఉన్నారు. పవన్ కి ఈసారి గెలవడం చాలా అవసరం. లేదంటే అనేక విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉంది ఇప్పటికే అతడిని ఎగతాళి అపహస్యం చేస్తున్నారు. ఒక సీటు కూడా గెలవలేని నీకెందుకు రాజకీయాలు అని ముఖం పట్టుకొని ప్రతిపక్ష పార్టీలో అతడిని అడుగుతున్నాయి. అందువల్ల పవన్ ఈ ఎలక్షన్ గెలిచి తీరాలి లేదంటే ఆయన ఆత్మవిశ్వాసం మరింత దెబ్బతినే ప్రమాదం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: