TDP: హీరో నిఖిల్ టిడిపిలో చేరడం ఒక బూటకమేనా.. అసలు ట్విస్ట్ ఇదే..!!
ఇక ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటే టిడిపిలో నిఖిల్ చేరలేదని.. కేవలం ఆయనకు సపోర్టుగా మాత్రమే అక్కడికి వెళ్లారని.. అయితే ఆయనను టిడిపి వర్గాలు ఆహ్వానించాయని స్పష్టం చేశారు. ఇకపోతే 2019లో టిడిపి తరఫున కూడా నిఖిల్ ప్రచారం చేసిన విషయం తెలిసిందే.. కర్నూలు జిల్లా డోన్ లో టిడిపి తరఫున ప్రచారం చేసి , టిడిపికి ఓటు గుద్దడంతో చంద్రబాబు స్టైల్ లో రెండేళ్లు చూపిస్తూ ఒక రేంజ్ లో ప్రచారం చేశారు.. అయితే ఆ తర్వాత నిఖిల్ పై రూమర్స్ క్రియేట్ చేయడం జరిగింది.
దీంతో నిఖిల్ టీమ్ స్పందిస్తూ.. నిఖిల్ ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అంటూ ప్రచారం చేస్తున్నారు. అవన్నీ చెత్త వార్తలు..ఆయన ఏ పార్టీ కి సపోర్ట్ చేయడం లేదు.. మంచి వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ నిఖిల్ సపోర్ట్ చేస్తారు.. ఆయన ఒక యాక్టర్ గా కాకుండా యంగ్ ఇండియన్ గా తన వంతు కృషి చేస్తారు అంటూ తెలిపారు నిఖిల్ టీం.. ఇకపోతే డోన్ అభ్యర్థి నిఖిల్ ఫ్యామిలీ మెంబర్ కాబట్టే అక్కడ సపోర్ట్ చేశారు అంటూ అప్పట్లో ఒక వీడియో రిలీజ్ చేశారు. మొత్తానికి అయితే తన మామయ్యకు సపోర్ట్ చేస్తున్నారే తప్ప తాను టీడీపీ పార్టీలోకి చేరలేదని స్పష్టం చేశారు..