ఆంధ్రప్రదేశ్ : జగన్‌కి వ్యతిరేకంగా యూట్యూబ్‌లో "వివేకం" మూవీ.. షాక్ అవుతున్న వైసీపీ..

Suma Kallamadi
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొలిటికల్ సినిమాలు వరుస పెట్టి రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాలు ఎన్నికలను ప్రభావితం చేసేలా జీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీ వాళ్లు ఒకరి గురించి ఒకరు వ్యతిరేకంగా సినిమాలు తీసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. రాజకీయ నేపథ్యంలో రూపొందిన యాత్ర 2 సినిమాని ఈ సంవత్సరం ఫిబ్రవరి 8వ తేదీన రిలీజ్ చేశారు. ఈ సినిమా ఏపీ సీఎం జగన్ గురించి చాలా పాజిటివ్ గా చూపించిందని ఆడియన్స్ అన్నారు. రాజకీయ నాయకుడిగా వైఎస్‌ జగన్‌ ఎలా ఎదిగారనేది ఈ సినిమాలో చక్కగా చూపించారు, కాగా ఇది చాలామంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.
జగన్ కి అనుకూలంగా చంద్రబాబుకి వ్యతిరేకంగా వచ్చిన మరో రెండు సినిమాలు శపధం, వ్యూహం అని చెప్పవచ్చు. వ్యూహం సినిమాకి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించాడు. వ్యూహం సినిమా మార్చి రెండవ తేదీన రిలీజ్ అయింది, శపధం సినిమా అదే నెలలో 8వ తేదీన విడుదలైంది. అయితే టీడీపీ పార్టీ కూడా జగన్ కి వ్యతిరేకంగా కొన్ని సినిమాలను విడుదల చేస్తోంది. వాటిలో "వివేకం" మూవీ ఒకటి. దీనిని ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌ లో రిలీజ్ కాకుండా జగన్ ప్రభుత్వం ఎన్నికల సంఘం నుంచి నోటీసులను తీసుకువచ్చింది. దాంతో టీడీపీ వారు యూట్యూబ్ లో "వివేకం" సినిమాని రిలీజ్ చేశారు. ఈ మూవీలో జగన్ గొడ్డలి పట్టుకొని వివేకానంద రెడ్డిని హత్య చేసినట్టుగా చూపించినట్లు ఉన్నారు. మూవీ పోస్టర్ చూస్తే అలాగే అనిపిస్తుంది. దీనిని చూసి వైసీపీ నాయకులు కంగు తింటున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాతో పాటు "రాజధాని ఫైల్స్' పేరిట మరొక సినిమాని టీడీపీ పార్టీ వారు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇదే కాకుండా నారా రోహిత్ హీరోగా ప్రతినిధి 2 సినిమా తీయిస్తున్నారు. ఇవన్నీ కూడా జగన్  ను అప్రతిష్ట పాలు చేసి, ప్రజల్లో అతనికి ఉన్న పేరు చెడగొట్టి,అతని ఓట్లు తగ్గించాలని టీడీపీ చేస్తున్న ప్రయత్నాలను చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సినిమా అనేది ఒక అస్త్రంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: