ఆంధ్రప్రదేశ్: అనపర్తి టికెట్ పొందిన బీజేపీ అభ్యర్థికి చేదు అనుభవం.. బూతులు తిడుతున్న టీడీపీ..?

Suma Kallamadi
తూర్పు గోదావరి జిల్లా అనపర్తి టికెట్‌ను టీడీపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఇస్తారని చాలామంది భావించారు. అతను కూడా టికెట్ కోసం ఆశించారు కానీ పొత్తులో భాగంగా టీడీపీ ఆ టికెట్‌ను బీజేపీ ఇచ్చేసింది దాంతో టీడీపీ అభ్యర్థి అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంతే కాదు నిరసనలు కూడా పెద్ద ఎత్తున చేపడుతున్నారు బీజేపీ అభ్యర్థులను బూతులు తిడుతూ రెచ్చిపోతున్నారు అతడికి కూడా ఓటు వేయడు అంటూ అత్యంత అసభ్య పదజాలాన్ని వాడుతున్నారు.
ఈ నియోజకవర్గంలో బీజేపీ గెలవలేదని, తమకు గెలిచే సత్తా లేదని ఆ పార్టీ నేతలే ఒప్పుకుంటున్నారని అనపర్తి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మద్దతుదారులు బూతులు మాట్లాడుతున్నారు. పార్టీ కార్యకర్తలే ఇలా రెచ్చిపోతున్నారంటే ఇక వారి కంటే పెద్ద నేతలు ఇంకా ఎన్ని బూతులు మాట్లాడుతున్నారో ఊహించుకోవచ్చు. ఒక నాయకుడికి అనుచరులుగా ఉండటం అతడిని దేవుడు లాగా పూజించడంలో తప్పులేదు కానీ ఇంకొక నాయకుడిని వ్యక్తిగతంగా విమర్శించడం తప్పు. అదే తప్పును రామకృష్ణారెడ్డి మద్దతుదారులు చేస్తున్నారు. సొంత పార్టీ నిర్ణయాన్ని గౌరవించకుండా దిగజారుడు ప్రవర్తనతో అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారారు.
అనపర్తి టికెట్‌ను బీజేపీ అభ్యర్థి శివరామకృష్ణంరాజు టీడీపీ అందించింది దేశ సేవ చేసిన శివరామకృష్ణంరాజును అంత దారుణంగా విమర్శించడం చాలామందికి నచ్చడం లేదు. ఈ అభ్యర్థి గెలుస్తాడా లేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు కానీ కార్యకర్తలే ఇప్పుడు అతను గెలవడు అని చాలా దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.
ఇకపోతే ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, మరియు బీజేపీ మధ్య పొత్తు ఏర్పడిన నేపథ్యంలో అన్ని పార్టీలు అసంతృప్తి జ్వాలలను ఎదుర్కొంటున్నాయి. నిన్న బీజేపీ తన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా శివకృష్ణంరాజు పేరును ప్రకటించింది.
వాస్తవానికి, పొత్తు కుదరకముందు అనపర్తి స్థానాన్ని టీడీపీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి కేటాయించింది. కానీ పొత్తుతో పరిస్థితులు మారిపోగా, అనపర్తి స్థానం బీజేపీకి కేటాయించారు. ఈ పరిణామంతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఓ దశలో భావోద్వేగాలు భరించలేక కంటతడి పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: