ఏపీ : జాబ్ రిజైన్ చేసి మరి.. జగన్ ను సీఎం చేస్తారట?

praveen
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్ర రాజకీయాలు వేడెక్కాయి. మూడు పార్టీలు కలిసి అధికారం లో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించేందుకు పావులు కదుపుతూ ఉన్నాయి. తాము కొన్ని చోట్ల ఓడిన పరవా లేదు కానీ అధికారం లో ఉన్న వైసిపి మాత్రం గెలవకూడదు అనే కోణం లో  వ్యూహాలు రచిస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇతర పార్టీలతో పొట్టు పెట్టుకోకుండా అధికార వైసిపి మాత్రం ఒంటరి గానే ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమైంది.

 ఇలాంటి సమయం లో ఇక ఎన్డీఏ కూటమి అధికార వైసిపి గురించి ఏ చిన్న విషయం దొరికిన దానిని హైలెట్ చేస్తూ ఉండటం కూడా కనిపిస్తోంది. అయితే అటు ఎన్నికల ప్రచారం లో ఏకంగా గ్రామ వాలంటీర్లు కూడా పాల్గొంటున్నారు అంటూ టిడిపి శ్రేణులు విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమం లోనే ఇటీవల శ్రీకాకుళం జిల్లాలోని సంత బొమ్మాలి మండలం లో బోరుభద్ర గ్రామ పంచాయతీలో వాలంటీర్లుగా పనిచేస్తున్న బొడ్డ శ్రీలత, మల్ల అశ్విని ఇలా ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నారు అంటూ టిడిపి ఆరోపించింది.

 కేవలం ఆరోపించడమే కాదు ఈ విషయం పై సి విజిల్ యాప్ ద్వారా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు కూడా చేశారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చన్నాయుడు. అయితే ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారి పోయింది అని చెప్పాలి. కాగా ఇలా గ్రామ వాలంటీర్లు ఇద్దరు కూడా వైసిపి తరఫున ప్రచారం చేస్తున్నారు అంటూ టిడిపి చేసిన ఆరోపణలపై.. వాలంటీర్లుగా విధులు నిర్వహిస్తున్న బొడ్డు శ్రీలత, మల్ల అశ్విని స్పందించారు. తమను సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదని తామే ఉద్యోగానికి రాజీనామా చేసి మరి మా జగనన్న ప్రచారంలో పాల్గొంటామని.. జగనన్నను మరోసారి గెలిపించుకుంటాము అంటూ వ్యాఖ్యలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: