ఆంధ్రప్రదేశ్: భార్య దెబ్బకి రఘురాజు అబ్బ.. జగన్ ఇచ్చే షాక్ తో గిలగిలా..

Suma Kallamadi
అధికార వైసీపీ పార్టీ నుంచి వెళ్లిపోతున్న వైసీపీ నేతల సంఖ్య పెరుగుతోంది. ఎన్నికల సమయంలో సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీలు మారడం చాలా సహజం. వీరు ఇలా చేయడానికి ప్రధాన కారణం టికెట్లు, సీట్లు ఇవ్వకపోవడమే అని చెప్పుకోవచ్చు. అయితే సీటు ఇచ్చినా వేరే పార్టీలోకి మారిన ఒకే ఒక్క నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. పోయినసారి భార్యకు కూడా ఆయన టికెట్ అడిగారు కానీ అది ఇవ్వడానికి సదరు పార్టీ నిరాకరించింది దాంతో ఆయన టీడీపీ పార్టీలో చేరి పోటీ చేశారు. రఘురామకృష్ణం రాజు కూడా పోయినసారి టిడిపిలో సీటు ఇచ్చిన అది కాదని వైసీపీ నుంచి పోటీ చేశారు.
ఇకపోతే వంశీకృష్ణ యాదవ్, రామచంద్రయ్య ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చినా కూడా వారు పార్టీ మారారు. వారు తెలుగుదేశం జనసేన పార్టీల వైపు వచ్చారు. దాంతో వైసీపీ వారిపై అనార్హత వేటను వేశారు. ఇక శృంగవరపుకోట నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ రఘురాజు కూడా ఇలాంటి సిచువేషన్ లోనే ఉన్నారు. రఘురాజు భార్య ఇటీవల పార్టీ మారారు. ఈయన వైసీపీ ఎమ్మెల్సీ పదవి హోదాలో హాయిగా కొనసాగుతూ భార్యను మాత్రం టీడీపీలో ఎమ్మెల్సీ హోదా కోసం పంపించారు.
తనకి, ఆమెకు మాత్రం ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు. వైసీపీ పార్టీ తనకు ఏం చేయలేదనే అసంతృప్తితో ఆమె అటు వెళ్లిపోయారని చెబుతున్నారు. అయితే రెండు పార్టీలలో కర్చీఫ్ వేసి డబుల్ గేమ్ వీరు ఆడుతున్నారని ఇతర వైసీపీ నాయకులు ఫైర్ అవుతున్నారు. అతనిపై అనర్హత వేటును వేయాలని కోరుతున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజు సతీమణి సుధారాణి టీడీపీలో చేరిన తర్వాత శృంగవరపుకోట రాజకీయాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. భార్య కారణంగా భర్త వైసీపీ నుంచి బహిష్కరణకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది ఇది అతడికి పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు.
ఇకపోతే రఘురాజు ప్రజల మధ్య చిచ్చుపెడతారు, నిత్యం కుటిల రాజకీయాలు నెరపుతూ వివాదాలకు కేంద్రబిందువవుతారు. అభివృద్ధికి అవరోధం కలిగిస్తారు. అనునిత్యం అహంకారధోరణి ప్రదర్శించే ఆయనను ప్రజలు నమ్మరు. చివరకు ఏ పార్టీ కూడా శాశ్వతంగా ఇముడ్చుకోదు. ఆయన రాజకీయ ప్రస్థానం ఆది నుంచీ అంతే అంటూ కొన్ని ఘటనలను ఎస్‌.కోట వాసులు ప్రస్తావించుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. శృంగవరపుకోట జెడ్పీటీసీ సభ్యుడిగా 2001–06 కాలంలో ఇందుకూరి రఘురాజు రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. అదే సమయంలో బొత్స ఝాన్సీలక్ష్మి విజయనగరం జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: