అమరావతి: సీఎంఓ వాట్సాప్ గ్రూపు నేమ్ చేంజ్ .. జగన్ చీప్ ట్రిక్స్..?

Suma Kallamadi
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని పార్టీల వారు చేస్తున్న పనులు చాలామందికి షాక్‌ ఇస్తున్నాయి. ఎలక్షన్ మోడల్ ఆఫ్ కోడ్ అమలు చేస్తున్న సరే కొన్ని పార్టీలు రూల్స్ బ్రేక్ చేస్తున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి కార్యాలయ వాట్సప్ గ్రూపు పేరును 'వైఎస్ జగన్ ఏపీ మీడియా'గా మార్చారు. ఈ గ్రూపులో ఉన్న ప్రజా సంబంధాల అధికారులు, ప్రభుత్వ జీతాలు పొందుతున్నవారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలు చేస్తున్నారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ, సీఎంఓ గ్రూపులో జగన్ ఎన్నికల ప్రచార సంబంధిత వార్తలు ఫొటోలను పోస్టు చేస్తున్నారు. 'సీఎం పీఆర్‌ఓలా.. వైకాపా నాయకులా?' అనే శీర్షికతో గురువారం ఒక కథనం ప్రచురితమైంది. దీనికి స్పందనగా, శుక్రవారం గ్రూపు పేరును మార్చారు.
అయితే, పీఆర్‌ఓలు శ్రీహరి, చంద్రకాంత్, ఈశ్వర్ నంబర్లతో మధ్యాహ్నం 3 గంటల వరకు సీఎం జగన్ పర్యటన వార్తలు, ఫొటోలను పోస్టు చేసారు. తర్వాత, వైఎస్‌ఆర్‌సీపీ మీడియా పేరుతో పోస్టులు చేస్తున్నారు. ఈ ఘటన ప్రజా సేవలో ఉన్న అధికారుల పాత్రను, వారి ప్రవర్తనను ప్రశ్నించేలా చేస్తోంది. ఈ వివాదం ప్రజా సేవకులు, రాజకీయ నాయకుల మధ్య సరిహద్దుల గురించి, వారి బాధ్యతల గురించి చర్చను రేపింది. ఇవన్నీ జగన్ ప్లే చేస్తున్న చీప్ ట్రిక్స్ అని కూడా చాలామంది విమర్శలు చేస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కా చెల్లెమ్మలకు రక్షణ కల్పించారు. దిశయాప్ ద్వారా అక్క చెల్లెమ్మలు ఆపదలో ఉంటే రక్షణ కల్పించామని ఆయన పేర్కొన్నారు. మేమంతా సిద్ధం సభలో ఆయన ప్రసంగించారు. ఆదాయం లేని అవ్వ, తాతలకు, అభాగ్యులైన అక్క చెల్లెమ్మలకు నెలనెలా పింఛన్ ఇస్తున్నారు. దేశంలో మొదటి సరిగా ఏపీలో నామినేటెడ్ పోస్టుల్లో 50% అక్క చెల్లెమ్మలకు రిజర్వేషన్ కల్పించామని సీఎం చెప్పారు. అక్క చెల్లెమ్మలు బ్యాంకు ఖాతాలు తీసుకొని చంద్రబాబు హయాంలో, తన హయాంలో ఎంతపడిందో చూసుకోవాలన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే లను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కాదు. మీ అందరి భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: