బిఆర్ఎస్ : పోచారం కామెంట్స్ వెనుక అంతరార్థం ఏంటి.. కేసిఆర్ ఏం చేయబోతున్నారు?

praveen
పార్లమెంట్ ఎలక్షన్స్ నేపద్యంలో ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. ఇక అన్ని పార్టీలు కూడా గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతూ ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలలో ఇక తమ పార్టీ తరపున నిలబడబోయే అభ్యర్థుల వివరాలను అన్ని పార్టీలు ప్రకటించాయి అన్న విషయం తెలిసిందే. కాగా పార్లమెంట్ ఎన్నికలకు ముందు అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి. పార్టీలో ఉన్న కీలక నేతలందరూ కూడా కారు దిగి చేయి తీర్థం పుచ్చుకుంటున్నారు.

 ఇప్పటికే కడియం, రంజిత్ రెడ్డి,కేకే, బీబీ పాటిల్ లాంటి ఎంతోమంది నేతలు అటు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక రానున్న రోజుల్లో ఇంకా ఎంతమంది బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరుతారు అన్నది కూడా ఊహకందని విధంగానే ఉంది. అయితే ఇలా పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి సంతాచాటాలి అనుకుంటున్నా టిఆర్ఎస్ కు కీలక నేతలు దూరమవుతూ ఉండడంతో ఊహించని షాక్ లు తగులుతున్నాయి. అయితే ఇలా కీలక నేతలందరూ పార్టీని వీడుతూ ఉండడంపై ఆ పార్టీ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పందించారు.

 ఆయన చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం కొత్త చర్చకు దారి తీసాయ్. ప్రస్తుతం పార్టీలో గట్టివాళ్లే మిగిలారు. పదవులు వ్యాపారాల కోసం పార్టీలోకి వచ్చిన వారు పార్టీలు మారారు. నాయకులను కొంటారేమో కానీ కార్యకర్తలను ఎప్పటికీ కొనలేరు అంటూ పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే పార్లమెంట్ ఎన్నికల తర్వాత బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అవుతాయి అంటూ శ్రీనివాస్ రెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి. పోచారం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక అంతరార్థం ఏమిటి.. కీలక నేతలు పార్టీని వీడుతున్న సమయంలో గులాబీ దళపతి కేసీఆర్ తన మాస్టర్ మైండ్ కు పని చెప్పి ఏదైనా వ్యూహం పన్నారా అన్నది ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చకు వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: