ఆంధ్ర ప్రదేశ్ : తెలుగుదేశం పార్టీకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ముస్లిం నేత..
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కు వైసీపీ ఈసారి టికెట్ ఇవ్వలేదు. దాంతో ఆయన కాంగ్రెస్ వైపు వెళ్లాలని చూస్తున్నారు. వైసీపీ అధినేతలు ఆ నియోజకవర్గ అభ్యర్థిగా ఆసిఫ్ ను ప్రకటించారు. మరోవైపు చంద్రబాబు నాయుడు రీసెంట్‌గా కదిరి సిటీలో పర్యటించారు. దానికి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా హాజరు కాకపోవడం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. సరిగ్గా వారం రోజుల క్రితం తనకు టికెట్ కావాలనే డిమాండ్ ను వినిపించారు కానీ టీడీపీ అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన రావడంతో ఆయన చంద్రబాబు నివాసం ముందు పార్టీ కార్యకర్తలతో ధర్నా కూడా చేయించారు. కానీ అప్పటికీ ఫలితం లేకపోయింది.
దాంతో అత్తరు చాంద్ బాషా ఏప్రిల్ 1వ తేదీన జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే టీడీపీకి షాక్ తగిలినట్లే అవుతుంది. ఆల్రెడీ టీడీపీ పార్టీకి చాలా వ్యతిరేకత వస్తోంది పొత్తు కుదుర్చుకొని చంద్రబాబు వారికి వెన్నుపోటు పొడిచేలా ప్రవర్తిస్తున్నారు. సొంత పార్టీని గెలిపించాలని ప్రజలను కోరుతున్నారే తప్ప బీజేపీ లేదా జనసేన అభ్యర్థులను గెలిపించాలని ఏ సభలో కూడా ప్రజలను అడగడం లేదు.
అంతేకాదు పూర్తి స్థాయిలో పెద్ద బహిరంగ సభలు నిర్వహించకుండా ఏదో సభలు నిర్వహించలేదు అన్నట్లుగా నిర్వహిస్తున్నారు. ఈసారి టీడీపీ పార్టీ అపజయం పాలైతే చంద్రబాబుకు పిలవడానికి మళ్లీ మరొక ఛాన్స్ రాకపోవచ్చు అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఈ టీడీపీ అధినేత ఇప్పటికే అవినీతి అక్రమ కేసుల్లో నిందితుడిగా అరెస్టు అయ్యారు ఎప్పుడు బెయిల్ పై బయటకు వచ్చారు కానీ భవిష్యత్తులో మళ్లీ జైలుకు వెళ్లకుండా ఉండేందుకు బిజెపితో ఆయన కొత్త కుదుర్చుకున్నారని కొందరు కామెంట్ చేస్తున్నారు.