విజేత‌: బాల‌య్య చిన్న‌ల్లుడు భ‌ర‌త్ మెజార్టీ లెక్క ఇదే... 100 % ప‌క్కా బంప‌ర్ విక్ట‌రీ..!

RAMAKRISHNA S.S.
ఏపీలో జనసేన - తెలుగుదేశం పార్టీ - బిజెపి పొత్తు నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో ఈ కూటమి చాలా అంటే చాలా బలమైన శక్తిగా కనిపిస్తోంది. ఇండియా హెరాల్డ్ పరిశీలనలో ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలోని విశాఖ జిల్లాలో పలు నియోజకవర్గాలలో ఈ మూడు పార్టీల కూటమి ప్రభావం చాలా గట్టిగా కనిపిస్తోంది. మరియు ముఖ్యంగా విశాఖపట్నం పార్లమెంటు పరిధిలో అందులోనూ విశాఖ నగరంలో టిడిపి తో పాటు జనసేనకు అటు ఉత్తర భారత దేశ సెటిలర్లు ఎక్కువగా ఉండడంతో బిజెపికి కూడా మంచి బలం ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడ జనసేన ఓడిపోయిన గణనీయమైన ఓట్లు సాధించింది.
అందుకే టిడిపి నుంచి పోటీ చేసిన బాలకృష్ణ చిన్నల్లుడు గీతం విద్యాసంస్థల అధినేత మెతుకుమిల్లి శ్రీ భరత్ కేవలం 3000 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. విచిత్రం ఏంటంటే విశాఖ నగరంలోని నాలుగు అసెంబ్లీ స్థానాలలో తెలుగుదేశం గెలిచినా భ‌ర‌త్‌ ఎంపీగా స్వల్ప తేడాతో ఓడిపోవలసి వచ్చింది. అయితే ఈసారి భరత్ వరుసగా రెండోసారి తెలుగుదేశం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి భరత్ స్పెషల్ ఎట్రాక్షన్ కానున్నారు. అటు జనసేన, బిజెపి బలం కూడా తోడు కానుంది.
వైసీపీ ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకతతో పాటు కూటమి బలంగా ఉండటం పైగా భరత్ గత ఎన్నికలలో స్వల్ప తేడాతో ఓడిపోయారన్న సానుభూతి ఈసారి క‌లిసి రానున్నాయి. గత ఎన్నికలలో భారత్ పై పోటీ చేసిన ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఈసారి విశాఖ తూర్పు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. దీంతో మంత్రి బొత్స‌ సత్యనారాయణ ఝాన్సీని ఇక్కడ నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపుతుంది.
ఈ సారి ఎవ‌రు గెలుస్తారు ? అన్న‌ది ప‌రిశీలిస్తే ఇండియా హెరాల్డ్ సూక్ష్మ ప‌రిశీల‌న‌లో భ‌ర‌త్ భారీ మెజార్టీతో విజ‌యం సాధించ‌బోతున్నారు. పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో మొత్తం పోలయ్యే ఓట్ల‌లో భ‌ర‌త్‌కు ఏకంగా 60 % ఓట్లు పోలైనా ఆశ్చ‌ర్య పోవాల్సిన ప‌నిలేదు. ఇక్క‌డ కూట‌మి ప్ర‌భావంతో భ‌ర‌త్ విశ్వ‌రూపం చూపిస్తూ ఘ‌న‌విజ‌యం సాధించి మ‌రీ పార్ల‌మెంటులోకి స‌గ‌ర్వంగా అడుగు పెట్ట‌బోతున్నాడు.
భ‌ర‌త్‌కు క‌నిష్టంగా 1.5 ల‌క్ష‌ల మెజార్టీ నుంచి 3 ల‌క్ష‌ల వ‌ర‌కు మెజార్టీ వ‌చ్చే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. గాజువాక‌లో వైసీపీ ప్ర‌యోగం చేసి మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్‌ను అన‌కాప‌ల్లి నుంచి తీసుకువ‌చ్చి పెట్ట‌డం కూడా వైసీపీకే మైన‌స్‌గా మారింది. ఏదేమైనా విశాఖ పార్ల‌మెంటు సీటుపై బాల‌య్య అల్లుడు గెలుపు రాసిపెట్టుకోవ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: