ఏపీ: జ‌న‌సేన‌కు ఇచ్చిన 21 సీట్ల‌లో ప‌క్కాగా గెలిచే సీట్లు ఇవే... ?

RAMAKRISHNA S.S.
ఏపీలో టీడీపీ - బీజేపీతో పొత్తులో భాగంగా జ‌న‌సేన‌కు మొత్తం 21 అసెంబ్లీ, 2 పార్ల‌మెంటు స్థానాలు కేటాయించారు. ముందు 24 అసెంబ్లీ తో పాటు మూడు పార్ల‌మెంటు సీట్లు ఇచ్చారు. అయితే ప‌వ‌న్ బీజేపీ కూడా పొత్తులోకి రావ‌డంతో అన‌కాప‌ల్లి పార్ల‌మెంటు సీటుతో పాటు మ‌రో మూడు అసెంబ్లీ సీట్లు కూడా బీజేపీ కోసం త్యాగం చేశారు. మచిలీప‌ట్నం పార్ల‌మెంటు సీటుకు ఇంకా జ‌న‌సేన అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఖ‌రారు అయిన జ‌న‌సేన అభ్య‌ర్థుల లిస్ట్ ఇది..
పిఠాపురం- పవన్‌ కల్యాణ్‌, తెనాలి - నాదెండ్ల మనోహర్ , అనకాపల్లి - కొణతాల రామకృష్ణ, కాకినాడ రూరల్‌ - పంతం నానాజీ, నెల్లిమర్ల - లోకం మాధవి, భీమవరం - పులపర్తి ఆంజనేయులు, తాడేపల్లిగూడెం - బొలిశెట్టి శ్రీనివాస్‌, నిడదవోలు - కందుల దుర్గేష్‌, రాజానగరం - బత్తుల బలరామకృష్ణ, పెందుర్తి - పంచకర్ల రమేష్‌ బాబు, యలమంచిలి - సుందరపు విజయ్‌ కుమార్‌, పి.గన్నవరం - గిడ్డి సత్యనారాయణ, రాజోలు - దేవ వరప్రసాద్ పోటీ చేస్తున్నారు.
అలాగే నరసాపురం - బొమ్మిడి నాయకర్‌, ఉంగుటూరు - పత్సమట్ల ధర్మరాజు, పోలవరం - చిర్రి బాలరాజు
తిరుపతి - అరణి శ్రీనివాసులు, రైల్వే కోడూరు - భాస్కరరావుతో పాటు కాకినాడ పార్ల‌మెంట‌కు టీ టైం అధినేత  తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్ పేరును ప‌వ‌న్ ఖ‌రారు చేసిన సంగ‌తి తెల‌సిందే. ఈ 21 అసెంబ్లీ, 2 పార్ల‌మెంటు స్థానాల్లో ఇండియా హెరాల్డ్ అంచ‌నాల ప్ర‌కారం జ‌న‌సేన ఖ‌చ్చితంగా గెలిచే సీట్ల లెక్కలిలా ఉన్నాయి.
పిఠాపురం, తెనాలి, అన‌కాప‌ల్లి, కాకినాడ రూర‌ల్‌, రాజాన‌గ‌రం, య‌ల‌మంచిలి, విశాఖ సౌత్‌, తాడేప‌ల్లిగూడెం, నిడ‌ద‌వోలు, పి.గ‌న్న‌వ‌రం, రాజోలు, న‌ర‌సాపురం, భీమ‌వ‌రం, పెందుర్తి ఉన్నాయి. ఇక రెండు ఎంపీ సీట్లు అయిన కాకినాడ‌, మ‌చిలీప‌ట్నం రెండు చోట్ల జ‌న‌సేన విజ‌యం సాధించ‌నుంది. అలాగే అవ‌నిగ‌డ్డ‌లో కూడా ఆ పార్టీకి విజ‌యావ‌కాశాలు ఉన్న‌ట్టు ఇండియా హెరాల్డ్ అంచ‌నా వేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: