రాయలసీమ: సిద్ధం సభ వద్ద ర‌చ్చ ర‌చ్చ చేసిన మాజీ మంత్రి అఖిల‌ప్రియ..!

Divya
టిడిపి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తాజాగా అరెస్ట్ చేయడం జరిగింది.. ముఖ్యంగా నంద్యాలలో ఏపీ సీఎం  మేమంతా సిద్ధం బస్ యాత్రను కొనసాగిస్తూ ఉండగా.. ఈ సందర్భంగా నంద్యాలలోని భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ క్రమంలోనే ఆ సభ వద్దకు వెళుతున్న అఖిల ప్రియ తమ నియోజకవర్గంలో ఉండేటువంటి  సాగునీటి విడుదలకు సంబంధించి ఏపీ సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు అఖిల ప్రియ కూడా ప్రయత్నించగా... ఈ విషయం తెలుసుకున్న వెంటనే అక్కడికి కార్యకర్తలు  టిడిపి శ్రేణులు కూడా భారీగా తరలివచ్చారు.దీంతో అక్కడ పోలీసులు అప్రమత్తం అవ్వడంతో అఖిలప్రియను అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు..

అఖిల ప్రియ స్టేషన్కు వెళ్లడానికి నిరాకరించినప్పటికీ.. దీంతో ఆ సభా ప్రాంగణం వద్ద అటు కార్యకర్తలు ఇటు నాయకులు నాన హంగామా చేస్తున్నారు.. ముఖ్యంగా అఖిలప్రియ వినతిపత్రం ఇవ్వడానికి వస్తే అరెస్ట్ చేయడం ఏంటి అంటూ కూడా పలువురు టిడిపి నేతలు అధికారులను సైతం ప్రశ్నిస్తున్నారు.. వీటితో పాటు తమ నియోజకవర్గంలో సాగునీటి సమస్యలు ఉన్నాయంటూ వెంటనే నీటిని విడుదల చేయాలంటూ కూడా టిడిపి శ్రేణులు కోరుతున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడ వాతావరణం మొత్తం ఉద్రిక్తతంగా కనిపించింది.

భూమ వర్గీయుల కు పోలీసులకు మధ్య వాగ్వాదం తోపులాట జరగడంతో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి భూమా అఖిల పైన చెయ్యి ఎత్తరని కూడా పలువురు టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు.. ముఖ్యంగా రైతులతో ముఖాముఖి సభకు  వెళ్ళినందుకు భూమా అఖిల వర్గం పైన కూడా ఎమ్మెల్యే గంగుల నాని వర్గీయులు కూడా దాడి చేశారని విధంగా తెలుస్తోంది. ఈ సమయంలోనే అటు టిడిపి వైసిపి నాయకులు మధ్య కూడా పలు రకాల వాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసు వాహనాన్ని ఎక్కించేందుకు అఖిలప్రియ  ప్రయత్నించగా ఆమె నిరాకరించింది.. చివరికి శిరివెళ్ల పోలీస్ స్టేషన్కు నడుస్తూ వెళ్ళింది అఖిలప్రియ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: