పవన్ నిలబడిన పిఠాపురంలో తాజా పరిస్థితి ఇది..!!

Divya
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ మొదలైనప్పటి నుంచి.. రాజకీయ నాయకుల ప్రచారం పతాక స్థాయికి చేరుకున్నది.. ముఖ్యంగా తాము నియోజకవర్గాల పరిధిలో ఉండే అభ్యర్థుల ఇంటింటికి ప్రచార కార్యక్రమాలను సైతం చేపడుతున్నారు.. చాలామంది స్థానిక నాయకులతో కలిసి రోడ్డు షోలను కూడా చేస్తూ ఉన్నారు. ఇటీవల అధికార పార్టీ వైసీపీ కాంగ్రెస్ లోకి చేరిన కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం కూడా శరవేగంగానే ప్రచారం కొనసాగిస్తూ ఉన్నారు.. ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తూ ఈ కార్యక్రమంలోని ఉదయం విలేకరులతో మాట్లాడటం జరిగింది.

తెలుగుదేశం బిజెపి జనసేన కూటమిపైన ఎన్నో రకాల విమర్శలు కూడా చేశారు.. తమని హౌస్ అరెస్ట్ చేసి పోలీసులతో లాటి దెబ్బలు కొట్టించి పలు రకాలుగా హింసించిన చంద్రబాబు నాయుడు వంటి శత్రువులతో పవన్ కళ్యాణ్ జతకట్టడం కాపు సామాజి గానికి సిగ్గుచేటని.. కాపు రిజర్వేషన్లు సామాజిక వర్గం కోసమే తాను పుట్టిన వ్యక్తిని అని తనను చంద్రబాబు అణిచి వేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారని అప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ దాక్కున్నారంటూ ప్రశ్నించారు.

టిడిపి కూటమి ఓటు వేయవద్దు అంటూ పద్మనాభం తెలియజేశారు.. కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో నెలకొన్న తాజా పరిస్థితులు ఇలా ఉన్నాయి..పవన్ కళ్యాణ్ కు పోటీ చేసే నియోజకవర్గం ఇదే అని పవన్ కళ్యాణ్ కు ప్రతికూల వాతావరణం నెలకొందని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఓడిపోతారంటూ ముద్రగడ పద్మనాభం తెలియజేశారు.. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా సామాజిక వర్గానికి ఏమి చేయలేదని.. కాపు సామాజిక వర్గం కోసం పోరాడుతున్న తనకి కూడా అండగా ఎప్పుడూ నిలబడలేదని.. కాపులు రాజాధికారం సంపాదించాలని ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వచ్చి ఉంటే ఆ ఉద్యమం ఎప్పుడో చేయవచ్చు అంటూ తెలియజేశారు. కేవలం కూటమిలో 20 సీట్లు ఒప్పుకొని తాను ఎందుకు మద్దతు నిలిచారని గతంలో చిరంజీవి ఓడిపోయారని పవన్ కళ్యాణ్ కూడా రెండు చోట్ల ఓడిపోయారని తెలిపారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమం వల్ల తాను చాలా నష్టపోయానని కూడా వెల్లడించారు ముద్రగడ పద్మనాభం. తనకు శత్రువుగా ఉన్నటువంటి వారందరినీ కూడా పవన్ కళ్యాణ్ కలిశారని కూడా తెలిపారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఓడిపోవడానికి ఎంతవరకైనా వెళ్తానంటూ ముద్రగడ తేల్చి చెప్పారు. ముఖ్యంగా సీఎం జగన్ పవన్ కళ్యాణ్ కు చాలా తేడా ఉందని కూడా వెల్లడించారు.. కాపు రిజర్వేషన్ కేవలం కేంద్ర పరిధిలో ఉంటాయని జగన్ ఎప్పుడు నిజాయితీగాని తెలిపారని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: