తన కుటుంబంలోనే 4 సీట్లు కేటాయించిన చంద్రబాబు.. అసంతృప్తిలో నేతలు..!!

Divya
ఆంధ్రాలో ఎన్నికలకు కేవలం మరో 50 రోజులు మాత్రమే గడువు ఉన్నది. వైసిపి టిడిపి నేతలు ఇప్పటికే పలు రకాల ప్రచారాలను కూడా మొదలు పెడుతూ ఉన్నారు.. వైసిపి టిడిపి నుంచి టికెట్లు దక్కని నేతలు సైతం ఇతర పార్టీలకు చేరి ఎన్నికలలో పోటీ చేయబోతున్నారు.. అయితే చంద్రబాబు నాయుడు టికెట్లు కేటాయింపు విషయంలో కేవలం ఒక్క ఫ్యామిలీకి ఒకే టికెట్ అంటూ కూడా ఒక నిబంధనను కూడా పెట్టారు.. కానీ తన సొంత ఫ్యామిలీ విషయంలో మాత్రం చంద్రబాబు ఈ నిబంధనను సైతం అసలు పాటించడం లేదు


తన కుటుంబానికి మాత్రం నాలుగు టికెట్లు ఇవ్వడంతో ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా రాజకీయాలలో మారుతున్నది. చంద్రబాబు నాయుడు కుప్పంలో పోటీ చేస్తూ ఉండగా టిడిపికి కుప్పం కంచుకోటగా ఉండడం జరిగింది. ఆయన కుమారుడు నారా లోకేష్ కూడా మరొకసారి ఇప్పుడు మంగళగిరి నుంచి ఎమ్మెల్యే గాని పోటీ చేయబోతున్నారు.. గత ఎన్నికలలో ఓడిపోయిన నారా లోకేష్ ఈ ఎన్నికలలో గెలవాలని చాలా పట్టుదలతో ఉన్నారు.  నందమూరి బాలకృష్ణ కూడా ఎమ్మెల్యేగా హిందూపురం నుంచి పోటీ చేస్తున్నారు. బాలయ్య చిన్న అల్లుడు భరత్ కూడా విశాఖ నుంచి ఎంపీగా టిడిపి నుంచి పోటీ చేయబోతున్నారు.

తమ కుటుంబానికి మాత్రం ఒక రూల్ ఇతర కుటుంబాలకు మరొక రూల్ పెట్టిన చంద్రబాబు ఈ నిర్ణయం పట్టా చాలామంది టిడిపి నేతలు అసహనంతో ఉన్నారు.. అలాగే మరొకవైపు బిజెపి జనసేనలను కేటాయించిన స్థానాలలో కూడా చాలా మార్పులు జరిగే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..2024 ఎన్నికలలో గెలుపు కోసం చంద్రబాబు ఎన్నో వ్యూహాలను సైతం చేస్తూ ముందుకు వెళుతున్న పెద్దగా ఫలించలేకపోతున్నాయి ఇప్పటికే సూపర్ సిక్స్ హామీలంటూ మ్యానిఫెస్టోను ప్రచారం చేసిన పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి.. కేవలం అధికారంలో ఉండే వైసీపీ పార్టీని ఎలాగైనా దించాలని ప్రయత్నం తప్ప ప్రజలకు ఏం చేస్తామనే విషయం పైన క్లారిటీ ఇవ్వలేదు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: