పిఠాపురంలోకి ఎంట్రీ ఇస్తున్న ముద్రగడ.. మరి జనసేన..!!

Divya
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఇప్పుడు పిఠాపురం నియోజవర్గం చాలా హాట్ టాపిక్ గా మారుతోంది. కూటమి అభ్యర్థిగా అక్కడ పవన్ కళ్యాణ్ బర్రిలోకి దిగబోతున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ వైసిపి ఎంపీ వంగా గీత నీ కూడా అక్కడ పోటీగా పవన్ కళ్యాణ్ మీద నిలబెడుతున్నారు.. ఒకవైపు జనసేన మరొకవైపు వైసీపీ ఈ నియోజకవర్గమైన చాలా ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తోంది. అలాగే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా ఇటీవలే వైసిపి పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల చాలామంది కాపు నేతలతో కూడా సమావేశాలను నిర్వహించారు ముద్రగడ..


కిర్లంపూడిలో తన నివాసంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు..ఎన్నికల ప్రచార శైలి ఏ విధంగా ఉండాలి సభలు సమావేశాలను కూడా ఎలా నిర్వహిస్తుండాలి వాటిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని ప్రజలకు ఇలాంటి విషయాలు చేరవేయాలనేవి మాట్లాడుకుంటున్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను ఎదుర్కోవాలంటే కలిసి పని చేయాలంటూ కూడా సూచనలు ఇచ్చారట. 2009లో తాను పిఠాపురం నుంచి పోటీ చేసినప్పుడు ఇప్పటికి రాజకీయాలు చాలా మారిపోయాయని.. పిఠాపురం సెగ్మెంట్ బాధ్యతలు తనకి కూడా అప్పగించారంటూ వెల్లడించారు ముద్రగడ పద్మనాభం. అలా కిర్లంపూడి లో ఉన్న ముద్రగడ పద్మనాభం పిఠాపురం వైసిపి నాయకులు కలవడం జరిగిందట.


ఈ సందర్భంగా వైయస్సార్ పార్టీలోని కొంతమంది పెద్దలు వైయస్ జగన్ ను మరొకసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని తపన ప్రతి ఒక్కరిలోనే ఉందని అందుకే చాలా కష్టపడి పని చేస్తున్నామని అందరికీ కూడా పిలుపునిస్తున్నామని తెలిపారు.. ఎన్నికలు మీ ఎన్నికలు అనుకొని కలిసిగా పనిచేస్తామంటూ కూడా తెలిపారుట.. వైసిపి పార్టీ గెలుపు కోసం నా వంతు కృషి నేను చేస్తాను మీ పని మీరు చేయండి అంటూ ముద్రగడ పద్మనాభం వెల్లడించారు. అయితే వంగ గీత ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకున్న అధికారులు పర్మిషన్ లేకుండా ప్రచారం నిర్వహిస్తున్నారు అంటూ అడ్డుకున్నారట. దీంతో ఆమె అక్కడి నుంచి వెను తిరిగి వెళ్ళిపోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: