ట్రోల్ కి గురవుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్..!!

Divya
డైరెక్టర్ హరిశంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఎలాంటి క్రేజ్ తీసుకొచ్చిందో చెప్పాల్సిన పనిలేదు.. దాదాపు మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్, హరిశంకర్, శ్రీ లీల కాంబినేషన్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని అనౌన్స్మెంట్ చేశారు. అయితే ఇప్పటివరకు కేవలం ఐదు రోజులు మాత్రమే ఈ సినిమా షూటింగ్ని పూర్తి చేసినట్లు తెలుస్తోంది. మొదటినుంచి ఈ సినిమా పైన భారీగా అంచనాలైతే ఏర్పడ్డాయి తమిళంలో హిట్ అయిన తేరీ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. కానీ డైరెక్టర్ మాత్రం ఈ చిత్రంలోని ఒక కథ లైన్ ను తీసుకున్నామని పూర్తిగా రీమేక్ చేయలేదంటూ వెల్లడించారు.

 ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ టీజర్ కూడా తేరి సినిమాకు అసలు సంబంధం లేకపోవడంతో అభిమానులు కూడా ఓకే అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే గడిచిన కొన్ని గంటల క్రితం ఉస్తాద్ నుంచి ఒక స్పెషల్ గ్లింప్స్ ని  రిలీజ్ చేశారు. అమెజాన్ ఈ ఏడాది ఏ సినిమాలను విడుదల చేయబోతుందో చెబుతూ ఒక ఈవెంట్ నిర్వహించగా అందులో ఈ గ్లింప్స్ ను రిలీజ్ చేయడం జరిగిందట. ఈ వీడియోలో మొత్తం పవన్ కళ్యాణ్ హీరో ఇజాన్ని చూపించారు డైరెక్టర్.

పవర్ఫుల్ పోలీసుగా అన్యాయాన్ని అరికట్టే ఒక ఉస్తాద్ ల పోరాడుతున్న వ్యక్తిగా చూపించారు. అయితే చివరిలో డైలాగ్స్ మొత్తం గాజు గ్లాసు మీదే చూపించడంతో కొంతవరకు అనుమానాలకు దారితీస్తోంది.. అసలు ఈ చిత్రానికి గ్లాస్ గుర్తుకు సంబంధం ఏంట.. పవన్ కళ్యాణ్ పార్టీ గుర్తు గ్లాస్ గుర్తే కదా.. ఎన్నికల దగ్గర పడుతున్న వేళ ఇలాంటి పంచు డైలాగులలో సినిమాలను చూపించడం సాధ్యమే అయినప్పటికీ కానీ ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ పూర్తిగా ఈ గ్లాజు గ్లాస్ గురించి చెప్పడం చాలా ఓవర్గా అనిపిస్తోందని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు.. అసలు సినిమాకే సంబంధంలేని ఈ గాజు గ్లాసు గుర్తును టీజర్ గా కట్ చేసి ఓవర్గా చేస్తున్నట్లు డైలాగులు కూడా కాస్త ఓవర్గానే చెప్పినట్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా కేవలం పొలిటికల్ సినిమాల ఉందంటూ కావాలని ఈ డైలాగులు చెప్పించారని పిస్తున్నట్టుగా కనిపిస్తోందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ డైలాగులు సినిమాలో ఉంటాయా లేకపోతే ఎలక్షన్స్ వరకు ఉంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: