ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ వైసీపీ నుంచి పూర్తిస్థాయిలో అభ్యర్థుల జాబితా ఇంకా వెలువడాల్సి ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కార్యకర్తల "సిద్ధం" సభలు పూర్తయిన నేపథ్యంలో ఈ నెల 18 వ తేదీ నుంచి ఎన్నికల ప్రచార కార్యక్రమాలు మొదలవుతాయని అంటున్నారు. అభ్యర్థుల ప్రకటన వివరాలు ఇంకా మేనిఫెస్టో ప్రకటన మొదలైన వివరాలు వెరపైకి వస్తోన్నాయి. ఇదే సమయంలో తెలుగు దేశం కూడా రెండో విడత అభ్యర్థుల ప్రకటించాల్సి ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థుల ఫైనల్ జాబితాలను సిద్ధం చేసుకుని, రిలీజ్ చేయాలని అధికార పార్టీ రెడీ అయ్యిందని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఈ నెల 16 వ తేదీన ఇడుపులపాయ లోని వైఎస్సార్ ఘాట్ వేదికగా.. అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులను జగన్ మోహన్ రెడ్ట్ ప్రకటించనున్నారని సమాచారం తెలుస్తుంది. 2019 ఎన్నికల సమయంలో కూడా ఇడుపులపాయ నుంచే అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పటి దాకా విడతల వారీగా విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో మార్పులు చేర్పులతో కలిపి మొత్తం 77 అసెంబ్లీ స్థానాలను, 23 లోక్ సభ స్థానాలకు ఇన్ ఛార్జ్ లను ప్రకటించింది వైసీపీ. ఈ క్రమంలో ఇంకా ఒకటి రెండు రోజుల్లో ఈ ఫైనల్ జాబితాను సిద్ధం చేసి ఈ నెల 16న ఇడుపులపాయలో జగన్ మోహన్ రెడ్డి స్వయంగా ప్రకటించనున్నారని అంటున్నారు.
ఇక ఆ ప్రకటన తరువాత జగన్ మోహన్ రెడ్డి పూర్తిస్థాయి ఎన్నికల ప్రచార కార్యక్రమాల షెడ్యూల్ విడుదలవ్వొచ్చని అంటున్నారు.మరో వైపు ఇప్పటికే 94 మంది అభ్యర్థులతో చంద్రబాబు మొదటి విడత జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 14 - గురువారం నాడు టీడీపీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేయనున్నట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇంకా ఇదే సమయంలో జనసేన, బీజేపీ ఏయే స్థానాల్లో పోటీ చేసేది వారికి క్లారిటీ ఉందని.. వారి వారి అవకాశాలను బట్టి అభ్యర్థులను ప్రకటించుకుంటారట.టీడీపీ - జనసేన - బీజేపీ కూటమిలో భాగంగా... మొత్తం 144 అసెంబ్లీ, 17 లోక్ సభ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక మిగిలిన వాటిలో 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు.. 10 అసెంబ్లీ ఇంకా అలాగే 6 లోక్ సభ స్థానాల్లో వరుసగా జనసేన, బీజేపీలు పోటీ చేయబోతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ 94 మంది అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో.. ఇంకా సుమారు 50 అసెంబ్లీ, 17 లోక్ సభ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.