జనసేన-వైసిపి పొత్తు విఫలం కావడంపై ప్రశాంత్ కిషోర్ సంచలన వీడియో..!!

Divya
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అధికార పార్టీలో వైసిపి.. ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి టిడిపి జనసేన మధ్య గత కొద్దిరోజులుగా మాటలు యుద్ధం నడుస్తూనే ఉంది.. అయితే గతంలో వైసిపి జనసేన పార్టీ పొత్తు కోసం ప్రయత్నించారనే వార్తలను రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు. అందుకు సంబంధించి ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ప్రస్తుతం అటు టిడిపి జనసేన పొత్తుల పైన తీవ్రమైన స్థాయిలో విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి తరుణంలోని బిజెపి పార్టీని కూడా కలుపుకోవాలని విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు..


ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో టిడిపి జనసేన బిజెపి పొత్తులతోనే నిలబడే పరిస్థితి ఉందని.. వైసిపి పార్టీని ఎదుర్కోవడం కోసం ఇలా అందరూ జతకట్టారని ఆరోపణలైతే వినిపిస్తున్నాయి.. ఇప్పుడు తాజాగా వైసిపి పార్టీ కూడా తమ అధినేతతో పొత్తు కోసం ప్రయత్నించింది అంటూ జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో విభాగంగా ఒక వీడియోని సైతం బయటపెట్టారు.. గతంలో పొత్తు కోసం మమ్మల్ని వైసిపి నే సంప్రదించింది అంటూ ఈ పోస్ట్ షేర్ చేయడం జరిగింది.. అతి 2017లో ఇలా చేసినట్లుగా తెలుస్తోంది.


ప్రశాంత్ కిషోర్ అందుకు సంబంధించి కొన్ని విషయాలను కూడా బయటపెట్టారు 2017లో నంద్యాల ఉప ఎన్నికల లో వైసీపీ ఓడిన తర్వాత జనసేనతో వైసిపి పార్టీ పొత్తు కోసం ప్రయత్నించిందంటూ పీకే వెల్లడించారు.. అప్పట్లో వైసిపి పొలిటికల్ స్ట్రాడిజర్ గా ప్రశాంత్ కిషోర్ కూడా వ్యవహరించారు.. ఈ వీడియో ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో వెల్లడించారో తెలియనప్పటికీ జనసేన కార్యకర్తలు పవన్ అభిమానులు షేర్ చేస్తున్నారు.. అయితే వైసిపి కార్యకర్తలు మాత్రం ఇదంతా కేవలం కావాలనే ఫేక్ వీడియోని సృష్టించి ఇలా చేస్తున్నారని వచ్చే ఎన్నికలలో కచ్చితంగా వైసీపీ పార్టీని గెలవబోతుందని దిమాని వెల్లడిస్తున్నారు.. మరి ఈ విషయం పైన ఎవరు ఎలా క్లారిటీ ఇస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: