వైఎస్.రాజశేఖర్ రెడ్డి గారి పై ప్రశంసలు కురిపించిన సీఎం రేవంత్..!!

Divya
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి సీఎంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి గుర్తింపు ఇప్పటికీ చెరగని ముద్రగ మిగిలిపోయింది.. చాలామంది నాయకులు సైతం ఇప్పటికీ ఈయనని పొగిడేస్తూ ఉంటారు.. అయితే రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వైయస్సార్ పార్టీ ఆవిర్భవించింది.. హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిన విషయం తెలిసిందే. ఇలా ఇంతటి భాగ్యనగరంగా మారడానికి ముఖ్య కారణం దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి అనడంలో ఎలాంటి సందేహం లేదని కూడా ఇప్పటికే ఎంతోమంది తెలియజేశారు. ఈ విషయాన్ని తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తెలియజేశారు..

హైదరాబాద్ కి ఇంతటి గుర్తింపు దక్కిందంటే అందుకు కారణం దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి అంటూ వెల్లడించారు. హైదరాబాద్ రామగుండం రాజీవ్ రహదారిలలో పవర్ టెక్ గ్రౌండ్ లను సైతం నిర్మించి శంకుస్థాపన చేయడంతో ఇంతటి పేరు ప్రఖ్యాతలు వచ్చాయని తెలియజేశారు.. హైదరాబాద్ అనగానే ఐటీ పరిశ్రమ తీసుకువచ్చింది నేనే అంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు.. ఈ ఘనతను ఆయనే స్వయంగా తీసేసుకున్నారు. కానీ ఇప్పుడు తాజాగా రాజశేఖర్ రెడ్డి పైన సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సైతం అందరూ ఆశ్చర్యపోతున్నారు.
అందుకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారుతున్నది.. ఈ రోజున నేను ఒక మాట గుర్తు చేయాలనుకున్న.. ఇవాళ హైదరాబాదుకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందంటే ఆరోజు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి కృషి అంటూ వెల్లడించారు ఎన్నో ఐటీ కంపెనీలను , ఫార్మా కంపెనీలను ఈ రాష్ట్రానికి పెట్టుబడులుగా తీసుకువస్తే.. ఆనాడు చేసిన పనికి ఈనాడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని తెలిపారు ఆనాడు కాంగ్రెస్ పార్టీని వీటిని తీసుకువచ్చింది అంటూ రేవంత్ రెడ్డి వాక్యాన్ని ఇచ్చారు. ప్రస్తుతం ఈ విషయం అటు రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: