రాయలసీమ : షర్మిల హామీలకు ఆకాశమే హద్దు

Vijaya


కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల హమీలిచ్చే విషయంలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు.  కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రత్యేకహోదాపైనే ప్రభుత్వం మొదటి సంతకం చేస్తుందట. వైజాగ్ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు చేయిస్తుందట. ఇక ప్రతి యేడాది క్రమం తప్పకుండా ఉద్యోగాల భర్తీ లాంటి హామీలు చాలానే ప్రకటించారు. ప్రత్యేకహోదా సాధనపై తిరుపతిలో బహిరంగసభ జరిగింది. ఈ సభలో షర్మిల మాట్లాడుతు రోజువారిలాగే జగన్మోహన్ రెడ్డిపైన నోటికొచ్చినట్లు మాట్లాడేశారు.  జన్ పైన తనలో పేరుకుపోయిన కసినంతా తీర్చుకుంటున్నారు.



నిజానికి రాష్ట్రవిభజన సమయంలో ఏపీకి ప్రత్యేకహోదా, రైల్వేజోన్ లాంటివన్నీ హక్కుగా రావాల్సినవే. కాని నరేంద్రమోడీ ప్రభుత్వం వాటిని కంపుచేసి తుంగలో తొక్కేసింది. విభజనతర్వాత జరిగినఎన్నికల్లో విభజన చట్టాన్ని తుంగలో తొక్కేయటంలో ముఖ్యమంత్రయిన చంద్రబాబునాయుడు యథాశక్తి మోడీ ప్రభుత్వానికి సహకరించారు. దాంతో ప్రత్యేకహోదా, రైల్వేజోన్ అంశాలు రాజకీయంగా వివాదాస్పదమైపైయాయి. ఈ విషయాలను షర్మిల పట్టించుకోకుండా కేవలం జగన్ను మాత్రమే పదేపదే టార్గెట్ చేస్తున్నారు. ఈ విషయాలను వదిలేస్తే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రత్యేకహోదాపైన మొదటిసంతకం చేస్తుందట.



కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి రావాలి ? 2024 ఎన్నికల్లో అయితే కచ్చితంగా అధికారంలోకి రాదు. ఇక 2029 ఎన్నికల గురించి ఇపుడు ఆలోచించటం కూడా అనవసరమే. ఇపుడు షర్మిల ఆకాశమేహద్దుగా షర్మిల రెచ్చిపోతున్నారంటే ఎన్నికలకోసమే అనితెలుస్తోంది. ఎన్నికల్లో జగన్ లేదా చంద్రబాబునాయుడులో ఎవరు అధికారంలోకి వచ్చినా షర్మిల మళ్ళీ కనబడరు. ఇపుడంటే జగన్ పైన ప్రతిరోజు ఆరోపణలతో బురదచల్లేస్తున్నారు కాబట్టి ఎల్లోమీడియా కూడా విపరీతమైన ప్రాధాన్యతిస్తోంది.



రేపటి ఎన్నికల్లో మళ్ళీ  వైసీపీ అధికారంలోకి వస్తే కొంతకాలం చంద్రబాబు, పవన్ కల్యాణ్ అడ్రస్సుండరు. కాబట్టి ఎల్లోమీడియా కూడా చేసేదేమీ ఉండదు. అప్పుడు షర్మిలను ఎల్లోమీడియా ఏమాత్రం పట్టించుకోదు. ఎల్లోమీడియా పట్టించుకోకపోతే రాజకీయాల్లో షర్మిల జీరోనే. ఒకవేళ చంద్రబాబు అధికారంలోకి వస్తే షర్మిలను అప్పుడుకూడా ఎల్లోమీడియా పట్టించుకోదు. ఎందుకంటే షర్మిల అవసరం చంద్రబాబు, ఎల్లోమీడియాకు ఉండదుకాబట్టే. ఇపుడంటే చంద్రబాబు, ఎల్లోమీడియా షర్మిలను జగన్ పైకి అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలకు కొదవలేదు. అందుకనే హామీలతో షర్మిల ఆకాశమేహద్దుగా చెలరేగిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: