ఏపీ ఎన్నికల కోసం కేంద్ర బలగాలు, పగడ్బందీ ఏర్పాట్లు?

Purushottham Vinay
ఏపీలో జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ తో పాటు రాష్ట్ర ఉన్నతాధికారులు ఏర్పాట్లని చాలా వేగవంతం చేశారు. ఈ ఎన్నికల ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలని నిర్వహిస్తున్నారు.ఇక ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఆ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు కీలక ఆదేశాలని జారీ చేయడం జరిగింది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పక్కాగా ఏర్పాట్లని చేస్తున్నారు.కేంద్ర ఎన్నికల సంఘం సూచనలను ఎప్పటికప్పుడు పాటిస్తూ లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు.2019 వ సంవత్సరంలో జరిగిన ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, ఈసారి ఓటింగ్ శాతం పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. స్వీప్ ద్వారా ఎప్పటికప్పుడు కూడా నోడల్ అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతులు పోలింగ్ ముగిసిన తర్వాత స్ట్రాంగ్ రూములో ఏర్పాటు,పోలీస్ భద్రతపై ఇప్పటికే పలు సూచనలు కూడా చేశారు.


 గతంలో ఎన్నికలు జరిగిన సుమారు నెలరోజుల దాకా కౌంటింగ్ జరగకపోవడంతో స్ట్రాంగ్ రూముల వద్ద భద్రతా సమస్యలు రాకుండా కట్టుదిట్టంగా చర్యలని తీసుకున్నారు.ఇక ఈసారి కూడా పోలింగ్ తేదీకి కౌంటింగ్ కు మధ్యలో ఎక్కువ గ్యాప్ ఉంటే అలాంటి సమస్యలు రాకుండా అవసరమైన ఏర్పాట్లని చేసేలా అధికారులను ఆదేశించారు రాష్ట్ర ప్రధాని ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. ఇక ఎన్నికల్లో అక్రమ మద్యం, నగదు అరికట్టడం కోసం పెద్ద ఎత్తున పోలీసు భద్రతని ఏర్పాటు చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో జరిగే ఎన్నికల కోసం ఎంత మేరకు కేంద్ర బలగాలు అవసరమవుతాయనే దానిపైన లెక్కలు కూడా రెడీ చేశారు. దీనిపై కేంద్ర హోం శాఖ అధికారులకు సమాచారంని ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహార్ రెడ్డి.రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరిగేలా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఈ ఎన్నికల్లో ఎలాంటి రాజకీయ సంబంధిత గొడవలు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇప్పటికే జిల్లాల వారీగా సమస్యాత్మక కేంద్రాలను గుర్తించిన అధికారులు.. అక్కడ కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని కూడా భారీగా ఏర్పాటు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: