పవన్ కళ్యాణ్ చేస్తున్న పనులు కరెక్టేనా..?

Divya
ఏపీలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్ది ప్రతిపక్షం పార్టీ తెలుగుదేశం జనసేన మద్య ఎట్టకేలకు నిన్నటి రోజున సీట్ల వ్యవహారం తేలిపోయింది.. 118 మంది అభ్యర్థుల తో ఉమ్మడి కూటమి జాబితాను సైతం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. ఇందులో 94 చోట్ల టిడిపి 24 చోట్ల జనసేన అభ్యర్థులు పేర్లను రిలీజ్ చేశారు.. టిడిపి లిస్టులో నారా లోకేష్ బాలకృష్ణ అచ్చమ్మ నాయుడు చంద్రబాబు తదితర పేర్లు వినిపించాయి. కానీ జనసేన మొదటి జాబితాలో పవన్ కళ్యాణ్ పేరు మాత్రం లేదు..

జనసేన పార్టీకి 24 అసెంబ్లీ మూడు లోక్సభ స్థానాలు ఇవ్వడంతో అటు జనసేన కేడర్ ఒక్కసారిగా బగ్గు మంటోంది. దీంతో చాలాచోట్ల అటు టిడిపి జనసేన నాయకులు కూడా రాజీనామాలు చేస్తూ జండాలను తగలబెడుతున్నారు.. అయితే ఈ విషయాల పైన వైయస్సార్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా జనసేన పార్టీ పనిచేస్తుందని విషయం మరొకసారి తేలిపోయిందని.. టిడిపి జనసేన ఎన్ని జిమ్ముక్కులు చేసిన..రాష్ట్రంలో అన్ని సీట్లు వైసిపి పార్టీని గెలుస్తుందని తెలిపారు.. ఈసారి కుప్పంలో కూడా విజయం వైసిపి పార్టీ సాధిస్తుందంటూ తెలిపారు..

ఒక రాజకీయ పార్టీ పెట్టి తమను నమ్ముకున్న అభిమానులను కార్యకర్తలను మోసం చేయడం చాలా దారుణం అంటూ సజ్జల గారు విమర్శించారు పవన్ కళ్యాణ్ కంటే ఆయనని అభిమానించే వారిని చూస్తే చాలా జాలి కలుగుతుంది అంటూ తెలిపారు.. జనసేన పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందని విషయాన్ని కూడా చంద్రబాబు చెబుతూ ఉంటే ఇక అభ్యర్థులు ఎవరు డిసైడ్ చేశారనేది తెలిసిపోతుంది అంటూ తెలుపుతున్నారు.. 24 మందిని పెట్టుకొని ఎవరి మీద యుద్ధం చేస్తారంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. చివరికి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తారో కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారంటూ తెలుపుతున్నారు.. కుప్పంలో చంద్రబాబు పోటీ చేస్తున్నాడని ప్రకటించుకున్నారు.. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ అనే విషయంపై నిర్ధారించలేదంటూ తెలుపుతున్నారు.. ఈ విషయం పైన జనసేన అభిమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే విషయం కూడా గుర్తించుకోవాలంటు తెలుపుతున్నారు. పొలిటికల్ పరంగా పవన్ కళ్యాణ్ చేస్తున్నది కరెక్టేనా అనే సందేహం అభిమానులలో కలుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: