గురి చూసి పొత్తు విషయంలో టిడిపిపై.. బిజెపి పార్టీ దెబ్బ..!!

Divya
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు కూడా సరికొత్త ఆసక్తికరంగా మారుతూనే ఉంటాయి. టిడిపి జనసేనతో బిజెపి కలుస్తుందంటూ గత కొద్ది రోజులుగా ప్రచారాలయితే వినిపించాయి ఢిల్లీకి వెళ్లి మరి చంద్రబాబు అమిత్యాతో భేటీ తర్వాత టిడిపి కచ్చితంగా nda లోకి చేరుతుందని వార్తలు వినిపించాయి. 2014 తర్వాత ఈ మూడు పార్టీలు తిరిగి మళ్లీ ఈసారి పోటీ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చేవారం ఈ పొత్తుల పైన సరైన క్లారిటీ రాబోతున్నట్టు తెలుస్తోంది.

అయితే టిడిపి తో పొత్తు పైన బిజెపి సరికొత్త ప్రణాళికలను తెర మీదకి తీసుకు వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. వచ్చే ఎన్నికలలో బిజెపి సొంతంగానే 370 నుంచి 400 సీట్ల లక్ష్యంతోనే ముందుకు వెళ్లబోతుందని తెలుస్తోంది. అమిత్ శాతో చంద్రబాబు సమావేశంలో పొత్తు విషయంలో సంబంధాలు కుదరలేదని వార్తలు వినిపిస్తున్నాయి .అయితే ఈ సమయంలో సీట్ల లెక్క పైన కూడా చర్చలు జరిగినట్లుగా ప్రచారం సాగుతోంది.. దీంతో టీడీపీ జనసేన అధినేతలు సైతం వచ్చే వారం ఢిల్లీ కి వెళ్లి మరి బిజెపి నేతలను కలవబోతున్నట్లు తెలుస్తోంది.అక్కడే ఈ మూడు పార్టీల పొత్తు విషయం పైన క్లారిటీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట.

అయితే బిజెపి ప్రభుత్వం టిడిపి ముందు ఉంచిన ప్రతిపాదనల విషయానికి వస్తే బిజెపిలో 10 ఎంపీ సీట్లను 20 అసెంబ్లీ సీట్లను ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తుందిట.. అయితే చంద్రబాబు మాత్రం 6 ఎంపీ సీట్లు 10 అసెంబ్లీ స్థానాలను ఇచ్చేందుకు సిద్ధమంటూ తెలియజేసినట్లు సమాచారం. కానీ అవి కూడా టిడిపి బలమైన చోట ఉన్న నియోజకవర్గాలలో బిజెపి సీట్లు అడిగినట్టు తెలుస్తోంది.. దీంతో అటు చంద్రబాబు నాయుడు పరిస్థితి అయోమయంగా మారుతోంది.ముఖ్యంగా ఇటు పవన్ కళ్యాణ్ కు కూడా సీట్ల మధ్య చర్చలు కూడా జరుగుతున్న అవేవీ కూడా ఇంకా ఫలించలేదు..ఇటు బిజెపి టిడిపి జనసేన మధ్య ఇంకా సీట్ల విషయంలో పొత్తులు కుదరకపోవడంతో రాబోయే రోజుల్లో ఈ పొత్తులు ఉండబోవని సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: