అమరావతి : రాజ్యసభకు బేరాలు కుదరలేదా ?

Vijaya

తన దృష్టంతా తొందరలో జరగబోయే సాధారణ ఎన్నికలు, పొత్తులపైనే కాబట్టి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ ఆలోచన కూడా లేదని చంద్రబాబునాయుడు స్పష్టంచేశారు. తన నివాసంలో సీనియర్ తమ్ముళ్ళతో  జరిగిన మీటింగులో చంద్రబాబు పై విషయాన్ని ప్రకటించారు. ఈరోజుతో రాజ్యసభ ఎంపీల నామినేషన్ ముగుస్తోంది. టీడీపీ తరపున ఎవరు నామినేషన్ వేయకపోతే వైసీపీ తరపున నామినేషన్లు వేసిన ముగ్గురు అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లే. ఏప్రిల్ 2వ తేదీన ఏపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ ఎంపీలు రిటైర్ అవుతున్నారు.



ఆ స్ధానాలను భర్తీచేయటానికి కేంద్ర ఎన్నికల కమీషన్  నోటిఫికేషన్ ఇచ్చింది. ఈనెల 27వ తేదీన పోలింగ్ జరగబోతోంది. అసెంబ్లీ సభ్యుల సంఖ్య ప్రకారం ప్రతి రాజ్యసభ ఎంపీ అభ్యర్ధికి 43 మంది ఎంఎల్ఏలు ఓట్లేయాలి. మామూలుగా అయితే 175 మంది ఎంఎల్ఏలైతే 44 మంది ఎంఎల్ఏలు ఓట్లేయాలి.  కానీ టీడీపీ ఎంఎల్ఏ గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ ఆమోదించారు కాబట్టి ఎంఎల్ఏల సంఖ్య 174 అయ్యింది. దీని ప్రకారం ప్రతి అభ్యర్ధికి 43 మంది ఎంఎల్ఏలు ఓట్లేయాలి.



ఈ 174లో వైసీపీ బలం 151 కాగా టీడీపీ బలం 22 మాత్రమే. దీని ప్రకారం టీడీపీ అభ్యర్ధి గెలవాలంటే అదనంగా 21 మంది ఎంఎల్ఏలు కావాలి. ఈ ఓట్లకోసం వైసీపీ అసంతృప్త ఎంఎల్ఏలకు తమ్ముళ్ళు గాలమేశారు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా గేలానికి ఎవరు తగిలినట్లులేరు. ఒక్కో ఎంఎల్ఏకి రు. 5 కోట్లు ఇద్దామని అనుకున్నారట. అయినా ఎవరు ఓటు వేయటానికి అంగీకరించలేదని సమాచారం. 50 మంది వైసీపీ ఎంఎల్ఏలు తమ పార్టీలోకి రావటానికి రెడీగా ఉన్నట్లు సీనియర్ ఎంఎల్ఏ గోరంట్ల బుచ్చయ్యచౌదరి చాలాసార్లు చెప్పారు.



టీడీపీ తరపున రాజ్యసభకు పోటీ పెట్టాలని వైసీపీ ఎంఎల్ఏల నుండే తమపై ఒత్తిడి వస్తున్నట్లు మాజీ ఎంఎల్ఏ బోండా ఉమ చెప్పారు. చివరకు ఇవన్నీ గాలిమాటలుగా తేలిపోయాయి. ఓటుకు రు. 5 కోట్లు ఇవ్వటానికి రెడీ అయినా వైసీపీ ఎంఎల్ఏలు ఎవరు అంగీకరించలేదని ప్రచారం జరుగుతోంది. అన్నీరకాలుగా ప్రయత్నాలు చేసి ఏదీ వర్కవుట్ కాలేదని అర్ధమైన తర్వాతే రాజ్యసభ ఎన్నికల్లో పోటీచేసే ఆలోచనే లేదని చంద్రబాబు బిల్డప్ ఇచ్చినట్లు అర్ధమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: