గోదావరి : హెలికాప్టర్ విషయంలో గగ్గోలు పెట్టేస్తున్న జనసేన

Vijaya


భీమవరంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిగాల్సిన హెలికాప్టర్ కు ఆర్ అండ్ బి అధాకారులు అనుమతివ్వలేదు. దాంతో పవన్  పర్యటనలకు ప్రభుత్వం మోకాలడ్డు అంటు జనసేన నానా గోలచేసేస్తోంది. భీమవరంలోని విష్ణు కాలేజి గ్రౌండ్స్ లో అనుమతులు ఉన్నప్పటికీ చివరినిముషంలో ప్రభుత్వం కావాలనే అడ్డుకున్నట్లుగా జనసేన నేతలంతా రెచ్చిపోతున్నారు.



ఇంతకీ అసలు విషయం ఏమిటి ? ప్రభుత్వం నిజంగానే అడ్డుకున్నదా ? అంటే అంత కరెక్టుకాదనే చెప్పాలి. విషయం ఏమిటంటే పవన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్  దిగటానికి విష్ణు కాలేజీని జనసేన నేతలు ఎంపిక చేసుకున్నారు. అయితే అక్కడ 2018 నుండి హెలికాప్టర్లు దిగటాన్ని సివిల్ ఏవియేషన్ నిషేధించింది. హెలిప్యాడ్ కు చుట్టుపక్కల 50 మీటర్లలోపు అపార్టమెంట్లున్నాయి. కొన్ని చెట్లు కూడా ఉన్న కారణంగా సివిల్ ఏవియేషన్ చాలా కాలంగా నిషేధించింది. ఇదే విషయాన్ని జనసేన నేతలకు ఆర్ అండ్ బి ఉన్నతాధికారులు స్పష్టంగా చెప్పారట.



ప్రత్యామ్నాయంగా వేరే చోట హెలిపాడ్ ను ఏర్పాటుచేసుకోమని అధికారులు చెప్పినా జనసేన నేతలు వినిపించుకోలేదట. వినిపించుకోకపోగా ఎదురు బురదచల్లేస్తున్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే అధికారులు హెలికాప్టర్ కు అనుమతి ఇవ్వకపోవటం వల్లే పర్యటనను రద్దుచేసుకున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. పవన్ హెలికాప్టర్లో బీమవరం రాలేకపోతే రోడ్డు మార్గాన రాలేరా అని వైసీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. ఇప్పటికి చాలాసార్లు పవన్ గోదావరి జిల్లాల్లో పర్యటించారు.



పవన్ ఎన్నిసార్లు పర్యటించినా రోడ్డుమార్గాన ప్రయాణం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మాత్రం ప్రత్యేకంగా హెలికాప్టర్లో పర్యటన అని మాత్రం పాయింట్ లేవదీస్తున్నారు. నిజంగానే తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించాలని పవన్ అనుకుంటే రోడ్డుమార్గాన ఎందుకు ప్రయాణం చేయలేదనే పాయింట్ ను మంత్రులు, వైసీపీ నేతలు పదే పదే ప్రస్తావిస్తున్నారు. గోదావరి జిల్లా పర్యటనను రద్దుచేసుకోవటానికి పవన్ హెలికాప్టర్ దిగటానికి అనుమతి నిరాకరించారన్న విషయాన్ని సాకుగా ఉపయోగించుకోవాలని ముందే అనుకున్నట్లు అనుమానంగా ఉంది. మరి చివరకు ఏమిచేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: