అమరావతి : జనాలు చంద్రబాబును నమ్ముతారా ?

Vijaya

తన తెలివితేటల మీద చంద్రబాబునాయుడుకు అపారమైన నమ్మకం. తనకు అనుకూలంగా ఎన్నిసార్లు మాటలు మార్చినా జనాలు నమ్మేస్తారని బాగా ఓవర్ కాన్ఫిడెన్స్ కనబడుతోంది. తాజాగా ఢిల్లీ పర్యటన తర్వాత తమ్ముళ్ళతో చెప్పిన మాటలే ఇందుకు సాక్ష్యాలు. రాబోయే ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకోవటం చంద్రబాబు టార్గెట్. అందుకు దాదాపు ఐదేళ్ళుగా చంద్రబాబు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. అనేక రకాల ప్రయత్నాలు తర్వాత చివరకు అమిత్ షా తో భేటీ అయ్యారు. అయితే ఎల్లోమీడియా అమిత్ షా తో భేటీని రివర్సులో చెప్పింది.





అమిత్ షా బతిమలాడుకుంటేనే పొత్తుల విషయం మాట్లాడేందుకు చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళినట్లుగా కలరింగ్ ఇస్తోంది. సరే ఎవరు ఏమి అనుకున్నా భేటీ వాస్తవం, చర్చలు జరిగింది నిజం. అవసరం ఉందికాబట్టి పొత్తులు పెట్టుకుంటున్నట్లు తమ్ముళ్ళకి చంద్రబాబు చెబితే ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరంలేదు. కాకపోతే బీజేపీతో పొత్తు రాష్ట్రాభివృద్ధి కోసమే అని అబద్ధాలు చెప్పారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాకపోతే అభివృద్ధి ఏమి అయిపోతుందో అన్న భయం చంద్రబాబులో కనబడుతోందని బిల్డప్ ఇస్తున్నది ఎల్లోమీడియా.





ఇదే చంద్రబాబు ఒకపుడు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నపుడు దేశం కోసం కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటున్నట్లు చెప్పారు. నరేంద్రమోడి ఆధ్వర్యంలో ఎన్డీయే ప్రభుత్వం ఏపి అభివృద్ధిని తుంగలో తొక్కేసిందని అప్పట్లో  మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ఏపీ అభివృద్ధి సాధ్యమని అప్పట్లో నానా రచ్చచేశారు. సీన్ కట్ చేస్తే ఇపుడు బీజేపీతో పొత్తుంటేనే ఏపీ అభివృద్ధి సాధ్యమన్నారు.





అంటే తనకు ఏ పార్టీతో పొత్తు అవసరమైతే ఆ పార్టీకి తగ్గట్లుగా మాట్లాడుతారని అర్ధమవుతోంది. ఇక్కడ చంద్రబాబు భయం ఏపీ అభివృద్ధి గురించి కాదు కేవలం తన తను, లోకేష్ భవిష్యత్తు పైన మాత్రమే అని అందరికీ తెలుసు. తాను చెప్పే మాటలను పార్టీలో తమ్ముళ్ళు కూడా నమ్మరన్న విషయం చంద్రబాబుకు తెలుసో తెలీదో. తమ్ముళ్ళే నమ్మని మాటలను ఇక జనాలు నమ్ముతారని చంద్రబాబు అనుకోవటం విచిత్రమనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: