ఆంధ్రాలో సీక్రెట్ గేమ్.. ఇదంతా నడిపిస్తుంది ఎవరు?

praveen
ఆంధ్రాలో రాజకీయం ఎంత వేడెక్కిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏకంగా అన్ని పార్టీలు కూడా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయ్. ఈ క్రమంలోనే ఇక అన్ని పార్టీల అధినేతలు కూడా ర్యాలీలు నిర్వహిస్తూ ఓటరు మహాశయులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా తెగ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే అధికారంలో ఉన్న వైసిపి మరోసారి తమ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది అని చెబుతుంటే.. ప్రజలు అధికార పార్టీకి తప్పక బుద్ధి చెబుతారని ఇక తమ పార్టీ తప్పక అధికారంలోకి వస్తుందని టీడీపీ ధీమా వ్యక్తం చేస్తోంది.

 ఇక ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని జనసేన భావిస్తుంది. అయితే షర్మిల రాకతో అటు కాంగ్రెస్ కూడా మళ్లీ ఆంధ్రలో పుంజుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇలా అన్ని పార్టీలు కూడా ఆంధ్రాలో అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతూ ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇక ఇప్పుడు ఆంధ్రలో ఒక సీక్రెట్ గేమ్ నడుస్తుంది అంటూ టాక్ వైరల్ గా మారిపోయింది. కృష్ణ, గుంటూరు, తెనాలి ప్రాంతాలలో గత కొంత మంది కార్లలో వస్తూ అక్కడి ప్రజలతో చర్చలు జరుపుతున్నారట.

 కేవలం 15 నుంచి 20 లక్షల రూపాయల వరకు మాత్రమే ఎకరా ఉన్న పొలాలను ఏకంగా 90 లక్షలకు, కోటి రూపాయల వరకు కొనుగోలు చేస్తామని చెబుతున్నారట. ఈ క్రమంలోనే పది రూపాయల స్టాంప్ పేపర్ మీద సంతకాలు చేయించుకుని లక్ష రూపాయలు భయానా కూడా ఇస్తున్నారట. ఒకవేళ మేము భూమిని కొనుగోలు చేయకపోతే భయానా కూడా తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని చెబుతున్నారట. ఇలా ఏకంగా టిడిపి అధికారంలోకి వస్తే  భూముల ధరలు పెరుగుతాయని.. ప్రజల్లో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారట. అయితే ఇదంతా ఎవరు చేస్తున్నారు. ఈ సీక్రెట్ క్రీమ్ నడిపిస్తున్నది ఎవరు అన్నది మాత్రం ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: