ముస్లిం దేశాల చేతుల్లో అమెరికాకు తొలిదెబ్బ?

Chakravarthi Kalyan
అమెరికాకు ఎంతో వ్యూహాత్మక సైనిక స్థావరం.. అగ్రరాజ్యం కంటిలో నలుసులా మారిన ఇరాన్ ను ఎదుర్కోవాలంటే అత్యంత అనువైన ప్రాంతం. మధ్యప్రాచ్యంపై పట్టు నిలుపుకోవడానికి.. సైనిక బలగాలకు అవసరమైన మందుగుండు సామగ్రి చేరవేయడానికి జోర్డాన్ లోని అత్యంత కీలకమైన ప్రదేశమే టవర్ 22. సిరియా, ఇరాక్, జోర్డాన్ మూడు దేశాల సరిహద్దులు కలిసే ఈ చోటు అమెరికాకు వ్యూహాత్మక ప్రాంతం.

ఇస్లామిక్ స్టేట్స్ పోరుకు ఇది చాలా కీలకమైన స్థావరం. సిరియాలోని ఉన్న మరో అమెరికా సైనిక స్థావరమైన అల్ టాన్స్‌కు అతి చేరువలో ఉండటం కలిసొచ్చే అంశం. ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులను అణచివేయడంతో టాన్ఫ్ స్థావరం ఎంతో కీలకంగా ఉంది. ఇంతటి ప్రాధాన్యమున్న ఈ ప్రాంతాన్ని రక్షించుకునేందుకు అమెరికా ఎంతో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుందో.. అదే విధంగా ఈ ప్రాంతపై దాడి చేసి పైచేయి సాధించేందుకు ప్రత్యర్థులు సైతం అంతే సాహసానికి పూనుకుంటారు.

జోర్డాన్ ఉన్న స్థావరంపై జరిగిన డ్రోన్ దాడితో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. శత్రు దుర్భేద్యమైన కీలక స్థావరంపై దాడి చేయడమే గాక.. ముగ్గురు సైనికులు మరణించారు.  మరో 34మంది సైనికులు, సిబ్బంది గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత అమెరికా దళాలపై జరిగిన తొలి దాడి ఇదే. ఈ దుశ్చర్య వెనక ఇరాన్ మద్దతు కలిగిన గ్రూప్ల హస్తం ఉండి ఉంటుందని జో బైడెన్ అనుమానం వ్యక్తం చేశారు.

ఈ దాడులకు పాల్పడింది తామేనని ఇరాక్ కేంద్రంగా పనిచేసే ముజిహిదీన్ ఆఫ్ ఇస్లామిక్ రెసిస్టెన్స్ గ్రూపు ప్రకటించింది. అయితే ఇప్పుడు కథ మారింది. ఈ దాడి చేసింది ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ కాదని అమెరికా కొత్త బాంబు పేల్చింది. ఖతాబ్ హిజ్బుల్లా ఈ దాడిని చేసిందని పేర్కొంది. ఇది ఒక రాజకీయ పార్టీ అని గత ఎన్నికల్లో పోటీ కూడా చేసిందని ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: