టీడీపీతో పొత్తుపై పవన్‌ కల్యాణ్‌ సెన్సేషనల్ కామెంట్స్?

Purushottham Vinay
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి బరిలో దిగాలని భావించారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణలు కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీతో పొత్తుపై పవన్‌ కల్యాణ్‌ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.పొత్తు ధర్మాన్ని తెలుగుదేశం పార్టీ ఉల్లంఘించిందన్నారు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్. జనసేన పార్టీతో చర్చించకుండానే సీట్లు ఎలా ప్రకటిస్తారని అడిగారు పవన్ కళ్యాణ్. సర్దుబాటుకు ముందే అభ్యర్థుల్ని ప్రకటించడం ఏమాత్రం సరికాదన్నారు. పొత్తులో ఉండగా మండపేట అభ్యర్థిని చంద్రబాబు నాయుడు ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. చంద్రబాబే సీఎం అభ్యర్థని లోకేష్‌ ప్రకటించినా నేను మౌనంగా ఉన్నానని గుర్తు చేశారు. జగన్‌ మోహన్ రెడ్డిని గద్దె దించడం కోసమే నేను సంయమనంతో ఉన్నానన్నారు. ఈ పొత్తు విచ్ఛిన్నం కావాలంటే ఎంతసేపని తన భావనను వ్యక్తం చేశారు. పొత్తు ధర్మం పాటించకుండా అభ్యర్థుల్ని ప్రకటించడం ఏంటని నిలదీశారు. టీడీపీ ప్రకటన జనసేన నేతలను ఆందోళనకు గురిచేసిందన్నారు పవన్ కళ్యాణ్. మండపేటలో జనసేనకు 18శాతం ఓట్లు వచ్చాయి. ఇక ఇప్పుడది 28శాతానికి పెరిగిందని చెప్పుకొచ్చారు.ఈ నేపథ్యంలోనే టీడీపీకి కౌంటర్‌గా అభ్యర్థులను ప్రకటించారు పవన్‌ కళ్యాణ్.


రాజోలు, రాజానగరంలో జనసేన పార్టీనే పోటీ చేస్తుందని చెప్పారు. ప్రత్యేక పరిస్థితుల్లోనే ఈ రెండు సీట్లు ప్రకటిస్తున్నానని వివరించారు. చంద్రబాబు నాయుడుకు ఉన్నట్టే నాకూ ఒత్తిడి ఉందన్నారు పవన్ కళ్యాణ్. ఈ పొత్తు ఇబ్బందికరమే.. కానీ టీడీపీతోనే కలిసి వెళ్తామని తేల్చి చెప్పారు. పొత్తులో ఉన్నప్పుడు ఒక మాట ఎక్కువా తక్కువా ఉంటుందని, ఎన్ని ఆటుపోట్లు ఉన్నా టీడీపీతో ముందుకెళ్తామన్నారు పవన్ కళ్యాణ్. జనసేన పోటీచేసే స్థానాలపై పవన్‌ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 50 నుంచి 70 సీట్లు తీసుకోవాలని కొందరు చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఎన్ని సీట్లు తీసుకోవాలో నాకు తెలుసని వారికి బదులిచ్చారు పవన్. ఒంటరిగా వెళ్తే సీట్లు సాధిస్తాం.. కానీ ప్రభుత్వం రాదని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్. అసలు ఏమీ తెలియకుండానే నేను రాజకీయాల్లోకి వచ్చానా అని ప్రశ్నించారు. ఇక స్థానిక ఎన్నికల్లో కచ్చితంగా మూడో వంతు సీట్లు తీసుకుంటామన్నారు. 2019 ఎన్నికల్లో 18లక్షలకు పైగా ఓట్లు సాధించినట్లు  ఆయన వెల్లడించారు. జనసేనకు బలం ఉంది కాబట్టే మనకీ గౌరవం అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: