CmJagan: చెల్లికి దీటైన సమాధానం చెప్పిన సీఎం జగన్..!!

Divya
ఆంధ్రప్రదేశ్లోని పొలిటికల్ విషయాలు రోజురోజుకి హాట్ టాపిక్ గా మారుతూ ఉన్నాయి. పొలిటికల్ లీడర్స్ సైతం విమర్శలతో సవాల్లతో ఎన్నికల బరిలో దిగేందుకు పలు రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.. ముఖ్యంగా అధికార పార్టీ వైసిపి ప్రతిపక్ష పార్టీ టిడిపి-జనసేనల మధ్య పోటాపోటీగా మాటలు యుద్ధం జరుగుతోంది.. ఇదంతా ఇలా ఉండగా ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా షర్మిల ఎంట్రీ ఇవ్వడంతో మరింత రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.. తన సోదరుడైన సీఎం జగన్ పైన కూడా ఈమె విమర్శలు చేస్తూ ఉన్నది.


ఈ క్రమంలోనే తన సోదరి ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల వ్యాఖ్యలకు సీఎం జగన్ ఇన్ డైరెక్ట్ గానే కౌంటర్ వేశారు.. నిన్నటి రోజున ఉరవకొండలో బహిరంగ సభను ఏర్పాటు చేసిన సీఎం జగన్ ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీకి తాజాగా చంద్రబాబు అభిమాన సంఘంగా చేరారని పరోక్షంగా షర్మిల పైన కూడా విమర్శలు చేయడం జరిగింది. హైదరాబాదులో ఉండి టిడిపి అధినేతకు చంద్రబాబుకు స్టార్ క్యాంపియన్గా పనిచేస్తున్నారు.. అంటూ కూడా ఎద్దేవ చేయడం జరిగింది.. చాలామంది జాకి పెట్టి చంద్రబాబును లేపేందుకు చాలా కష్టపడుతున్నారంటూ సెటైర్లు వేశారు ఏపీ సీఎం జగన్..



అంతేకాకుండా ఇక్కడ వీళ్లు ఎన్ని చేసినా సరే వీళ్ళ ఇల్లు వాకిలి అంతా కూడా పక్క రాష్ట్రమేనని తెలిపారు. అయితే షర్మిల వ్యాఖ్యలకు జగన్ పరోక్షంగానే ఇలా కౌంటర్ ఇచ్చారంటూ పలువురు రాజకీయ నాయకులు తెలుపుతున్నారు. మరి జగన్ వాక్యాల పైన షర్మిల కూడా ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి. మొత్తానికి అన్నాచెల్లెళ్ల విమర్శలతో ఏపీ పొలిటికల్స్ లో చాలా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇక టీడీపీ జనసేన పొత్తుల విషయంలో కానీ సీట్ల విషయంలో కానీ సీఎం పదవి విషయంలో కానీ మేనిఫెస్టో విషయంలో కానీ ఇంకా స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: