ఇండియా గొప్పతనం ఇదే.. ముస్లిం శిశువుకి రాముడి పేరు?

praveen
ప్రస్తుతం ఇండియాలో ఎక్కడ చూసినా కూడా జైశ్రీరామ్ అనే నినాదాలు వినిపిస్తూ ఉన్నాయ్. ఎందుకంటే దాదాపు శతాబ్దాల రామ మందిర కళ నెరవేరడంతో.. ఇక దేశవ్యాప్తంగా మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా ఆనందంలో మునిగిపోయారు అని చెప్పాలి. ఇక రామ జన్మభూమిగా పిలుచుకునే అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగగా.. ఇటీవల ఏకంగా బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా జరిగింది.

 ఈ క్రమంలోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా అయోధ్య రామ మందిరానికి సంబంధించిన వార్తలే కనిపిస్తూ ఉన్నాయి. అయితే మొదటి రోజు కేవలం అతిధులకు మాత్రమే రామ మందిరంలో దర్శన భాగ్యం కల్పించగా.. ఇక నిన్నటి నుంచి అటు సామాన్య భక్తులకు సైతం ఇక రాముడిని దర్శించుకునేందుకు అవకాశం కల్పించారు. దీంతో ప్రపంచ నలుమూలలో ఉన్న హిందువులందరూ కూడా అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకునేందుకు తరలివస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే భారత్ ఎన్నో మతాల సమ్మేళనం అని చెబుతూ ఉంటారు. హిందూ ముస్లిం అందరూ భాయి భాయి అంటూ ఉంటారు.

 ఇందుకు నిదర్శనంగా ఎన్నో ఘటనలు వెలుగులోకి వస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. ఏకంగా ఒక ముస్లిం కుటుంబం శ్రీరామ విగ్రహ ప్రతిష్టాపన సమయంలో పుట్టిన తమ కొడుకుకి ఏకంగా రాముడు పేరు పెట్టారు. విగ్రహ ప్రతిష్టాపన సమయంలో పుట్టిన శిశువుకి కుటుంబీకులు రామ్ రహీంగా నామకరణం చేశారు. ఫిరోజాబాద్ లో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రతిష్టాపన ముహూర్త సమయంలో ఫర్జానా అనే మహిళా జిల్లా ఆస్పత్రిలో మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో హిందూ ముస్లిం ఐక్యతను సూచించేలా తన మనవడికి రామ్ రహీం అనే పేరు పెట్టామని ఇక ఆ శిశువు బామ్మ హుస్నా భాను తెలిపింది. ఈ విషయం తెలిసి ఇది కదా ఇండియా గొప్పతనం అంటే.. మతాలు వేరైనా ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డల్లా హిందూ ముస్లింలు ఉంటారు అంటూ ఎంతో మంది నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: