అమరావతి : చంద్రబాబు, ఎల్లోమీడియాకు బిగ్ షాక్
రాజకీయ వ్యూహకర్త చంద్రబాబునాయుడుతో పాటు ఎల్లోమీడియాకు పెద్ద షాకే ఇచ్చారు. తాను టీడీపీ కోసం ఎలాంటి పనిచేయటంలేదని నిర్మొహమాటంగా ప్రకటించారు. ఒక ఇంటర్వ్యూలో వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(పీకే) మాట్లాడుతు ఎన్నికల్లో తాను తెలుగుదేశంపార్టీ కోసం ఏ రూపంలో కూడా పనిచేయటంలేదని చెప్పారు. తనకు చంద్రబాబుకు మధ్యలో ఉన్న కామన్ ఫ్రెండ్ ఒత్తిడి వల్లే తాను కలిసినట్లు చెప్పారు.
ఎన్నికల్లో టీడీపీ గెలుపుకోసం తనను పనిచేయమని చంద్రబాబు కామన్ ఫ్రెండ్ ద్వారా అడిగించినట్లు చెప్పారు. అయితే తాను వ్యూహకర్త బాధ్యతల నుండి తప్పుకున్నట్లు ఫ్రెండ్ తో చెప్పారట. తాను తెలుగుదేశంపార్టీకే కాదు ఏ పార్టీకి కూడా పనిచేయటంలేదని స్పష్టంగానే కామన్ ఫ్రెండ్ కు చెప్పారట. అయితే ఒకసారి చంద్రబాబును వ్యక్తిగతంగా కలిసి తనకు చెప్పిన విషయాన్నే చెప్పమని ఫ్రెండ్ బాగా ఒత్తిడి తెచ్చారట. ఇక తప్పని పరిస్ధితుల్లో కామన్ ఫ్రెండ్ కోసమే తాను చంద్రబాబును కలిసినట్లు పీకే ఇంటర్వ్యూలో చెప్పారు.
చంద్రబాబును కలిసినపుడు తాను ఎన్నికల్లో పనిచేయలేనని చెప్పినట్లు కూడా పీకే చెప్పారు. దాంతో పీకే తాజా ఇంటర్వ్యూ కారణంగా చంద్రబాబుతో పాటు ఎల్లోమీడియాకు పెద్ద షాకిచ్చినట్లే అయ్యింది. ఎందుకంటే టీడీపీ గెలుపుకోసం పీకే పనిచేస్తున్నట్లు ఎల్లోమీడియా పదేపదే కథనాలు వండి వారుస్తోంది. ఒకవైపు నాలుగు సంవత్సరాలుగా రాబిన్ శర్మ బృందం టీడీపీ గెలుపుకోసం పనిచేస్తున్నపుడు మళ్ళీ పీకే వచ్చి ఏమిచేస్తాడని సందేహాలు వ్యక్తంచేశారు.
అయితే పీకే సలహాలతోనే చంద్రబాబు నడుకుంటున్నారని, ప్రచారం బ్రహ్మాండంగా వచ్చేస్తోందని, క్షేత్రస్ధాయిలో టీడీపీ ప్రభంజనం ఖాయమని చంద్రబాబుకు పీకే చెప్పాడని ఎల్లోమీడియా పదేపదే వార్తలు రాస్తోంది. దాంతో ఏది నిజమో ఏది అబద్ధమో కూడా తెలుసుకోలేక చాలామంది అయోమయానికి గురయ్యారు. అయితే ఒక ఇంటర్వ్యూలో తాను చంద్రబాబు కోసం పనిచేయటంలేదని స్వయంగా పీకేనే స్పష్టంగా ప్రకటించటంతో చంద్రబాబుతో పాటు ఎల్లోమీడియా గాలి తీసేసినట్లయ్యింది. పీకే ఇంటర్వ్యూపై తమ్ముళ్ళు ఎలా స్పందిస్తారో చూడాలి.