గల్లా జయదేవ్: వైసీపీలోకి సూపర్ స్టార్ మహేష్ బావ?

frame గల్లా జయదేవ్: వైసీపీలోకి సూపర్ స్టార్ మహేష్ బావ?

Purushottham Vinay
తెలుగుదేశం పార్టీ 2019లో మూడు ఎంపీ సీట్లు గెలిస్తే అందులో ఇద్దరు పార్టీకి దూరం అయ్యారని ప్రచారంలో ఉంది. వారిలో విజయవాడ ఎంపీ కేశినేని నాని తాజాగా జగన్ మోహన్ రెడ్డిని కలసి వచ్చారు.ఆయన వైసీపీలో చేరడం ఖరారు అయింది. ఇపుడు మరో ఎంపీ మీద వైసీపీ కన్ను పడిందని అంటున్నారు.ఇక ఆయన ఎవరో కాదు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్. ఈయన స్వయానా సూపర్ స్టార్ మహేష్ బాబు బావ.ఆయన 2014, 2019లలో రెండు సార్లు గుంటూరు నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా పనిచేశారు.అయితే గత కొంతకాలం నుంచి జయదేవ్ టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.అయితే ఆయన రాజకీయ వైరాగ్యంలో ఉన్నారని కూడా అంటున్నారు.తాజాగా ఆయన వైసీపీ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డితో సమావేశం అయ్యారని సమాచారం తెలుస్తోంది.ఇద్దరిదీ ఒకే నియోజకవర్గం కావడం వల్ల ఈ భేటీ జరిగిందని భావించినా ఈ సమయంలో ఈ మీట్ జరగడం మాత్రం ఆసక్తిని రేపుతోంది.



అది కూడా కేశినేని నాని వైసీపీ వైపు వచ్చిన వేళ గల్లా జయదేవ్ వైసీపీ ఎమ్మెల్యే, జగన్ కి అత్యంత సన్నిహితుడు అయిన చెవిరెడ్డి భాస్కరరెడ్డితో భేటీ అంటే అది మామూలు విషయం కాదని అంటున్నారు.ఇక దీని మీద అపుడే సోషల్ మీడియాలో ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తొందరలోనే గల్లా జయదేవ్ కలుస్తారు అని కూడా ప్రచారం మొదలైంది. అలాగే ఆయనకు గుంటూరు ఎంపీ టికెట్ కూడా ఇస్తారని  అంటున్నారు.అంతే కాదు తెలుగుదేశం పార్టీలో కీలక నేతలను కూడా వైసీపీ టార్గెట్ చేసింది అన్న టాక్ ఉంది. ఆపరేషన్ టీడీపీ పేరుతో వైసీపీ రానున్న రోజులలో పెద్ద ఎత్తున ముఖ్యమైన నేతలను తమ పార్టీలో చేర్చుకునే కార్యక్రమానికి రంగం సిద్ధం చేసిందని అంటున్నారు. ఇక గల్లా జయదేవ్ మహేష్ బాబుకి పెద్ద బావ. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కూతురు పద్మావతి భర్త.జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ కూడా సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: