పవర్ స్టార్ విషయంలో అలా చేయడం నచ్చలేదంటున్న బర్రెలక్క....!!

murali krishna
తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే. పవన్ సినిమా లో చిన్న పాత్రలో నటించినా జాతకం మారిపోతుందని చాలామంది ఫీలవుతారు.అయితే ఈ మధ్య కాలం లో ప్రముఖ రాజకీయ నాయకులు బర్రెలక్క తో పవన్ కళ్యాణ్ ను పోలుస్తూ పవన్ పరువు కు భంగం కలిగించేలా కామెంట్లు కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ కామెంట్లు తన దృష్టికి రావడం తో బర్రెలక్క శిరీష ఒకింత ఘాటు గా స్పందించారు. ఎవరి పార్టీ వాళ్లదని ఎవరి పొలిటికల్ లైఫ్ వాళ్లదని ఆమె తెలిపారు. పవన్ కళ్యాణ్ పవర్ ఆయనదని నా పవర్ నాదని శిరీష పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఎంతో మంచి వ్యక్తి అని నాతో పోల్చి ఆయనను తక్కువ చేయడం నాకు నచ్చలేదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. వైరల్ అవుతున్న వీడియో లను నేను చూస్తున్నానని శిరీష తెలిపారు.

పవన్ కు నేను అభిమానినని ఆమె పేర్కొన్నారు. నేను దేనికీ రియాక్ట్ అవ్వలేకపో తున్నానని ఆమె కామెంట్లు చేశారు. పవన్ ను మైనస్ చేయడానికి నన్ను వాడటం సరికాదని శిరీష అభిప్రాయపడ్డారు. శిరీష చేసిన కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. శిరీష 2024 ఎన్నిక ల్లో ఎంపీ గా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారం నిజమవు తుందో లేదో చూడాల్సి ఉంది. పవన్ కెరీర్ విషయానికి ప్రస్తుతం పవన్ పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టారు. పవన్ ఏపీ రాజకీయాల్లో అనుకూల ఫలితాలను అందుకుంటానని నమ్మకం తో ఉన్నారు. 30 స్థానాలలో జనసేన పోటీ చేసే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది. త్వరలో టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించ నున్నారు. భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేయనున్నారని సమాచారం అందుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: