అమరావతి : మళ్ళీ రుణమాఫీ హామీనా ?

Vijaya


రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ కాంగ్రెస్ హామీలను కాపీ కొడుతున్నారా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. జనాలను ఆకర్షించి ఓట్లు రాబట్టుకోవటానికి రెండుపార్టీల ఆధ్వర్యంలో మ్యానిఫెస్టో కమిటి పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ కమిటితో ఈమధ్యనే భేటీ అయిన చంద్రబాబు ఉచిత హామీలపై దృష్టిపెట్టమని చెప్పారట. ఇక్కడ ఉచిత హామీలంటే ఇప్పటికే చంద్రబాబు మినీ మ్యానిఫెస్టోలో చెప్పినవి కావు.



అందనంగా ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ అన్నది చాలా కీలకంగా ఉండాలని చెప్పారట. వ్యవసాయానికి ఇఫ్పటికే ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. అందుకని పేదల ఇళ్ళకు అంటే నెలకు 200 లోపు యూనిట్లు వాడే వాళ్ళకి లేదా తెల్లరేషన్ కార్డుదారులకు విద్యుత్ ఉచితమని హామీ ఇవ్వబోతున్నారు చంద్రబాబు, పవన్. అలాగే గతంలో ఇచ్చిన రైతు రుణమాఫీని మరోసారి ఇవ్వాలని చంద్రబాబు అనుకుంటున్నట్లు సమాచారం. పేదల ఇళ్ళకు ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ హామీలను పవన్ తో మాట్లాడి ఫైనల్ చేయాలని చంద్రబాబు అనుకున్నారట.



ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కర్నాటక, తెలంగాణా ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ మామీలనే చంద్రబాబు కాపీకొట్టబోతున్నట్లు అర్ధమవుతోంది. అయితే చంద్రబాబు హామీలను జనాలు నమ్ముతారా అన్నదే సందేహం. ఎందుకంటే 2014 ఎన్నికల్లో రైతు రుణమాఫీ హామీనిచ్చి అధికారంలోకి రాగానే ఎలా అమలుచేశారో అందరు చూసిందే. హామీలను నిలుపుకోవటంలో చంద్రబాబు ట్రాక్ రికార్డంతా బ్యడే అనటంలో సందేహంలేదు.



అవసరానికి చంద్రబాబు ఎన్ని హామీలనైనా ఇచ్చేస్తారని జనాలందరికీ బాగా తెలుసు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చే హామీలను జనాలు నమ్ముతారనే నమ్మకంలేదు. అందుకనే కాంగ్రెస్ తరహాలోనే హామీలకు ష్యూరిటీలను ఇవ్వాలని కూడా ఆలోచిస్తున్నారట. హామీలను పాంప్లెట్ రూపంలో ప్రింట్ చేసి చంద్రబాబు, పవన్ సంతకాలు చేయబోతున్నారని పార్టీవర్గాల సమాచారం. చంద్రబాబు ఆలోచనలు చూస్తుంటే అచ్చంగా కాంగ్రెస్ పార్టీ దారిలోనే నడుస్తున్నట్లుగా అర్ధమవుతోంది. అయినా కర్నాటక, తెలంగాణా కాంగ్రెస్ బాటలో ఏపీ కాంగ్రెస్ నడవాలి కానీ చంద్రబాబు, పవన్ నడవటం ఏమిటో అర్ధంకావటంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: