అమరావతి : జగన్ను కంట్రోల్ చేయటమే టార్గెట్టా ?
ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డిని వైజాగ్ వెళ్ళకుండా అడ్డుకోవటమే అసలు టార్గెట్ గా కనిపిస్తోంది. మూడురాజధానులను జగన్ ప్రకటించినప్పటి నుండి టీడీపీ ఆధ్వర్యంలో ప్రతిపక్షాలు ఎంత గోలచేస్తున్నాయో అందరు చూస్తున్నదే. అలాగే టీడీపీకి మద్దతుగా అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని రైతుసంఘంతో పాటు అనేక సంస్ధలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కేసులు వేశాయి. వీళ్ళందరి ఉద్దేశ్యం ఏమిటంటే జగన్ను అమారవతి నుండి బయటకు కదలకుండా కట్టడిచేయటమే.
అయితే మూడురాజధానుల అంశం కోర్టు విచారణలో ఉంది కాబట్టి క్యాంపు ఆపీసును ఏర్పాటుచేసుకుని తాను వైజాగ్ వెళ్ళాలన్నది జగన్ ఆలోచన. దీన్నికూడా ముందుకు పడనీయకుండా ప్రతిపక్షాలు చాలా ప్రయత్నాలు చేశాయి. అయితే ఏవీ కుదరలేదు. అందుకనే తాజాగా అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని రైతుల ముసుగులో మరో కేసు హైకోర్టులో దాఖలైంది. వీళ్ళ అభ్యంతరం ఏమిటంటే క్యాంప్ ఆఫీసు ముసుగులో జగన్ విశాఖకు వెళిపోతున్నారట. క్యాంపు కార్యాలయం అన్నది అసలు బిజినెస్ రూల్సులోనే లేదట.
రాజధాని అమరావతే అంటు గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును జగన్ ఉల్లంఘిస్తున్నట్లు పిటీషనర్లు ఆరోపించారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే మూడు రాజధానులు అంశం కోర్టు పరిధిలో ఉంది కాని క్యాంపు ఆఫీసు అన్నది పూర్తిగా జగన్ ఇష్టం. ఎక్కడ కూర్చుని పాలన చేయాలన్న విషయాన్ని ముఖ్యమంత్రి డిసైడ్ చేసుకోవచ్చు. ఈ విషయంలో కోర్టులో కూడా జోక్యంచేసుకునే అవకాశంలేదు. ఇక హైకోర్టు తీర్పులోని చాలా అంశాలను సుప్రింకోర్టు తప్పుపట్టింది. కాకపోతే తీర్పుమొత్తంమీద ప్రభుత్వం అడిగినట్లు స్టే మాత్రం ఇవ్వలేదు.
అందుకనే వైజాగ్ ను రాజధాని అని కాకుండా తన క్యాంప్ ఆపీసును రుషికొండ మీద ఏర్పాటు చేసుకుంటున్నట్లు జగన్ చెప్పింది. అలాగే వివిధ శాఖల వికేంద్రీకరణలో భాగంగానే కొన్ని శాఖలను వైజాగ్ తరలిస్తున్నారు. ఇతర ప్రాంతాలకు శాఖలను తరలించటాన్ని సుప్రింకోర్టు కూడా తప్పుపట్టలేదు. ఇక్కడ పిటీషనర్ల ఉద్దేశ్యం ఏమిటంటే ఎన్నికలు అయిపోయేంతవరకు జగన్ను వైజాగ్ వెళ్ళకుండా ఆపాలని. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయి మళ్ళీ చంద్రబాబునాయుడే ముఖ్యమంత్రి అవుతారని వీళ్ళు అనుకుంటున్నట్లున్నారు. చంద్రబాబు సీఎం అయితే మూడు రాజధానుల ఏర్పాటు ఆగిపోతుందన్నది వీళ్ళ ఆలోచనగా ఉంది. అందుకనే ఎన్నిరకాలుగా వీలైతే అన్నిరకాలుగా అడ్డుకుంటున్నది. మరి తాజా కేసుపై హైకోర్టు ఏమంటుందో చూడాలి.