అతిశక్తివంతమైన అణుబాంబు రెడీ చేస్తున్న అమెరికా?
అయినా సరే ఏ దేశానికదే అణ్వాయుధాలను తయారు చేసుకుంటూ తమ అమ్ముల పొదిలో దాచుకుంటున్నాయి. అయితే ఉక్రెయిన్, రష్యా యుద్ధ నేపథ్యంలో ఆ ఒప్పందం నుంచి రష్యా బయటకు వచ్చింది. ఆ తర్వాత కొన్ని ప్రయోగాలు చేస్తోంది. బాలిస్టిక్ మిస్సైల్స్ కొత్త తరహా వాటికి శ్రీకారం చుడుతోంది. ఇలాంటి తరుణంలో అమెరికా సైతం రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఉపయోగించిన న్యూక్లియర్ బాంబు కంటే 24 రెట్లు శక్తి మంతమైన బాంబును తయారు చేస్తున్నట్లు ప్రకటించి న్యూక్లియర్ బాంబు లాంటి వార్తను పేల్చింది. న్యూక్లియర్ వెపన్ ను తయారు చేస్తునట్లు పెంటగాన్ ప్రకటించడం కలకలం రేపుతోంది.
న్యూక్లియర్ ఆయుధాలను పెంచుకుంటూ పోతున్న అగ్రరాజ్యం అతిపెద్ద బాంబును సైతం తయారు చేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికాలోని నేషనల్ న్యూక్లియర్ సెక్యూరిటీ అడ్మినిస్ర్టేషన్ తయారు చేస్తున్న ఈ అణుబాంబుకు బీ 64-13 అని పేరు పెట్టారు. వార్ జెట్స్ ద్వారా ప్రయోగించే ఈ అణు బాంబులు గ్రావిటీ పవర్ సాయంతో లక్ష్యాన్ని ఛేదిస్తాయి. అమెరికా తయారు చేస్తున్న తాజా బాంబు ఏకంగా 360కిలో టన్నుల శక్తిని విడుదల చేస్తోంది.
ఇప్పుడు ఇవే కాకుండా రకరకాలైన అణుబాంబుల రకాలను సైతం తయారు చేస్తోంది. యుద్ధాలు పెరగిపోతున్న నేపథ్యంలో వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతోంది. అయితే బాంబులను మోసుకెళ్ల గలిగే బీ-21 అప్ గ్రేడ్ వర్షెన్ ను ప్రయోగించి విజయవంతమైంది. రాబోయే రోజుల్లో 100 విమానాలను తయారు చేసేందుకు సైతం ఆర్డర్లు ఇచ్చింది. ప్రస్తుతం అమెరికా తన ఆయుధ సంపత్తిని పెంచుకుంటున్నట్లు ప్రకటించడం కలకలం రేపుతోంది.