గోదావరి : దెబ్బకు ఉక్కిరి బిక్కిరి అయిపోయారా ?
ఇందులో భాగంగానే శనివారం ఉదయం 9.30 గంటలకు మొదలైన ఇంటరాగేషన్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఆదివారం రెండోరోజు కూడా ఇదేపద్దతిలో విచారణ చేయబోతోంది. చంద్రబాబును అడిగేందుకు సీఐడీ మొత్తం 120 ప్రశ్నలు రెడీ చేసుకున్నది. ఇందులో మొదటిరోజు సుమారు 50 ప్రశ్నలను సంధించింది. జర్మనీ సంస్ధ సీమెన్స్ సంస్ధలో బోగస్ ఒప్పందం, డిజైన్ టెక్ తో చేసుకున్న ఒప్పందం, నిధుల విడుదల, ఉన్నతాధికారులు వద్దంటున్నా ఒత్తిడితెచ్చి నిధులు విడుదల చేయించిన వైనం, విడుదలైన నిధులను షెల్ కంపెనీలకు తరలించిన విధానంపై ఎక్కువగా ప్రశ్నలు వేశారట.
ఉత్తరప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారిణిని ఏపీలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో డిప్యుటేషన్ పై ఎందుకు తీసుకొచ్చారు ? సీమెన్స్ ఇండియా అప్పటి ఎండీ సుమంత్ బోస్ తో రహస్య ఒప్పందం, అప్పటి నోట్ ఫైల్స్, సీమెన్స్ 90 శాతం నిధులను విడుదల చేయకుండానే ప్రభుత్వం 10 శాతం నిధులు రు. 371 కోట్లను విడుదల చేయటానికి కారణాలను అడిగి తెలుసుకున్నారట.
మొత్తంమీద తమ ప్రశ్నలతో చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేసేసినట్లు తెలుస్తోంది. కాకపోతే చంద్రబాబు ఏ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేదని సమాచారం. మొదటినుండి చంద్రబాబు వైఖరి ఇలాగే ఉంటుంది. పదిరోజుల క్రితం సీఐడీ కస్టడీలో ఉన్నపుడు కూడా ఏమి అడిగినా తెలీదు, గుర్తులేదు, మరచిపోయాననే సమాధానమిచ్చారు. ఇపుడు కూడా దాదాపు ఇలాంటి సమాధానాలే ఇచ్చుంటారనటంలో సందేహంలేదు. ఏదేమైనా తనను అన్యాయంగా అరెస్టుచేశారన్న వాదనను మాత్రమే చంద్రబాబు పదేపదే వినిపిస్తున్నారు.