ఢిల్లీ : లోకేష్ ఇక్కడా అబద్ధాలేనా ?

Vijaya

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబునాయుడు అరెస్టుపై లోకేష్ ఢిల్లీలో టీవీ ఛానళ్ళతో వరసబెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ నేపధ్యంలో స్కామ్ జరిగిందని చెప్పటంపై చర్చకు సవాలు విసిరారు. ఢిల్లీలో టీవీ స్టూడియోల్లో కూర్చుని సవాలు విసిరేబదులు అదేదో రాజమండ్రిలోనో లేకపోతే విజయవాడలోనే చాలెంజ్ చేసుండచ్చు. పైగా ప్రభుత్వం, సీఐడీ చెబుతున్నదంతా అబద్ధాలే అని మాట్లాడారు. మంత్రివర్గ నిర్ణయం లేకుండా కార్పొరేషన్ ఏర్పాటైందని సీఐడీ చెప్పిందంతా అబద్ధమే అన్నారు. 2015 ఫిబ్రవరి 16న మంత్రివర్గం ఆమోదంతోనే కార్పొరేషన్ ఏర్పాటైనట్లు చెప్పారు.


అయితే కార్పొరేషన్ ఏర్పాటైంది 2014 జైలేలోనే అని ఫైళ్ళమీద డేట్లు చెబుతున్నాయి. ఒప్పందంలోని అంశాలు వేరు, జీవోలోని అంశాలు వేరని స్పష్టంగా తెలుస్తోంది. కార్పొరేషన్ ఏర్పాటుచేయకుండానే నిదులు జారీచేయమని చంద్రబాబు చెబితే చేసేందుకు లేదని ఫైనాన్స్ సెక్రటరీ అడ్డంపడితే అప్పుడు హడావుడిగా కార్పొరేషన్ ఏర్పాటుకు మంత్రివర్గం అనుమతి తీసుకున్నారని సీఐడీ చెబుతోంది. ఈ కేసులో చంద్రబాబు సంతకం ఉన్న ఫైలు ఒక్కటన్నా చూపండని లోకేష్ సవాలు విసురుతున్నారు. చంద్రబాబు సంతకాలు 13 చోట్ల ఉన్నట్లు సీఐడీ చీఫ్ డాక్యుమెంట్లు కూడా చూపించారు.


ఇక్కడ లోకేష్ చాలా అతితెలివి కూడా చూపించారు. ఎలాగంటే చంద్రబాబుకు డబ్బులు ఎక్కడ అందిందో చెప్పాలన్నారు. అయితే డబ్బులు అందినట్లు సంతకం చేయటానికి చంద్రబాబు ఏమన్నా అమాయకుడా ? డబ్బులు అందినట్లు కాదు, డబ్బులు రీలీజ్ చేయమని చంద్రబాబు ఒత్తిడి చేయటంతోనే రు. 371 కోట్లు విడుదల  చేసినట్లు అప్పటి చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు, ఫైనాన్స్ ప్రిన్సిపుల్ సెక్రటరీ పీవీ రమేష్, ఫైనాన్స్ సెక్రటరీ సునీత స్పష్టంగా నోట్ ఫైల్స్ లో రాసింది లోకేష్ కు తెలీదా ?


విచిత్రమైన వాదన ఏమిటంటే చంద్రబాబును అరెస్టుచేసి ఆధారాల కోసం చూస్తున్నామని సీఐడీ చెప్పిందని లోకేష్ అంటున్నారు. సీఐడీ ఈ విధంగా ఎక్కడా చెప్పలేదు. అవినీతికి పాల్పడినట్లు తగిన ఆధారాలున్నాయి కాబట్టే అరెస్టుచేసినట్లు చెప్పారు. అందుకనే సెక్షన్ 409 కింద కేసు పెట్టి చంద్రబాబును అరెస్టుచేసింది. జగన్మోహన్ రెడ్డి అవినీతికి లెక్కలున్నాయని లోకేష్ అంటున్నారు. నిజంగానే ఆధారాలుంటే అన్నింటినీ బయటపెట్టి జీవితఖైదు వేయించచ్చు  కదా బెదిరింపులు ఎందుకు ? నిజంగానే ఆధారాలుంటే జగన్ను  టీడీపీ వదిలిపెట్టేదేనా ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: